Park Geun-hye
-
ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష
South Korea Park Geun Hye Freed After 5 Years From Prison: అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యున్-హే దాదాపు ఐదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యారు. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017లో పార్క్‌ని అరెస్ట్ చేయడమే కాక 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ గతవారం పార్క్‌కు ప్రత్యేక క్షమాభిక్షను మంజూరు చేశారు. (చదవండి: చేపల వర్షం గురించి విన్నారా!... నిజంగా ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట!) అంతేకాదు గతాన్ని మర్చిపోయి దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి.. కరోనా పరిస్థితులను సమష్టిగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూన్ జే-ఇన్ వెల్లడించారు. పైగా గత ఐదేళ్లుగా కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షురాలు పార్క్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని అందువల్ల తాను దీనిని కూడా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. అయితే పార్క్ విడుదలకు పిలుపునిచ్చేలా పార్క్ మితవాద అనుకూల సమూహాలు వారానికోసారి ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ మేరకు పార్క్కూడా ప్రజల ఆందోళనలకు కారణమైనందుకు క్షమపణలు చెప్పడమేకాక ఈ నిర్ణయం తీసుకున్నందుకు మూన్‌కి ధన్యవాదలు తెలిపారు. పైగా పార్క్ మాజీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అయిన కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీ, మూన్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నందున పార్క్ విడుదలైంది. అంతేకాదు వందలాది మంది పార్క్ మద్దతుదారులు ఆమె విడుదలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రి బయటే గడ్డకట్టే చలిలో ఆమె రాక కోసం పుష్పగుచ్చలతో వేచిఉండటం విశేషం. అయితే ఆమె తదుపరి మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఏదైనా క్రీయాశీల పాత్ర పోషిస్తుందా అనే విషయం పై ఎలాంటి స్పష్టత లేదు. (చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!) -
భారీ కుంభకోణం: పార్క్‌కు 24ఏళ్ల ఖైదు
సియోల్: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ హై(66)కు 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి కేసులో భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెకు ఈ శిక్షను ఖరారు చేశారు. దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగిన ఆమె అనూహ్య రీతిలో పతనమయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం, క్రిమినల్ ఆరోపణలపై సుమారు 10 నెలల పాటు పార్క్ గెన్ను విచారించారు. మాజీ అధ్యక్షురాలు పార్క్ గెన్ సుమారు 2.2 కోట్ల డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్లు ధృవీకరించినకోర్టు తీర్పును వెలువరించింది. అధ్యక్ష అధికారాలను ఆమె దుర్వినియోగం చేశారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడంతోపాటు దేశ వ్యవహారాల్లో భారీ గందరగోళం తీసుకొచ్చారని న్యాయమూర్తి కిమ్ సే-యున్ వ్యాఖ్యానించారు. ఆమెకు విధించిన కఠిన శిక్ష భవిష్యత్ నాయకులకు ఒక గుణపాఠం కావాలన్నారు. ప్రాసిక్యూషన్ 30 సంవత్సరాలు శిక్షను కోరగా ..సాక్ష్యాధారాలను పరిశీలించిన ముగ్గురు జడ్జీల బెంచ్ ఆమెకి 24 ఏళ్ల జైలుశిక్షతో పాటు, 17 మిలియన్ డాలర్ల జరిమానా విధించారు. మరోవైపు న్యాయస్థానం తీర్పును ప్రసారం చేయాలని నిర్ణయించిన తరువాత తీర్పును వినడానికి ఆమె సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరు కాలేదు. అంతేకాదు పార్క్ మరియు ఆమె న్యాయవాదులు కూడా పాల్గొనడానికి నిరాకరించారు. దక్షిణ కొరియాలో ఇలా జరగడం మొదటిసారి. దీనికి సంబంధించిన చట్టాన్ని గత సంవత్సరం ఆమోదించిన తర్వాత తీర్పును లైవ్ టెలికాస్ట్ చేశారు. అటు కోర్టు వెలుపల వందల కొద్దీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమి గూడారు. బిగ్ స్క్రీన్‌పై కోర్టు తీర్పును పరికించారు. అనంతరం కొరియా, అమెరికా జెండాలతో పార్క్ విడుదలను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. 2012లో పార్క్ దేశ మొదటి మహిళా అధక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్లకే ఆమెపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమెను అభిశంసించాలని ఆ దేశ పార్లమెంటు కూడా నిర్ణయించింది. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అధ్యక్షురాలు పార్క్ , ఆమె స్నేహితురాలు చోయ్ సూన్ సిల్ ద్వారా శాంసంగ్‌కు భారీ ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. -
దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం
అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించిన రాజ్యాంగ న్యాయస్థానం సియోల్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హేను అధికారికంగా పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం చారిత్రక తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూటర్లు ఇప్పటికే పార్క్ పేరును నిందితుల జాబితాలో చేర్చడంతో ధర్మాసనం ఆమెపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అనుమతిచ్చింది. పార్క్ చర్యలు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని, ప్రజల నమ్మకానికి ద్రోహం చేయడమే అని చీఫ్ జస్టిస్ జంగ్–మీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కోర్టు ప్యానెల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని పార్క్ గెన్ హేను పదవి నుంచి తొలగిస్తున్నామని ప్రకటించారు. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్‌తో కుమ్మక్కై పార్క్ అవినీతికి పాల్పడ్డారని, కంపెనీల నుంచి లక్షల డాలర్లను వసూలు చేశారని, చోయ్‌ను ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకునేలా అవకాశం కల్పించారని కోర్టు పేర్కొంది. -
దక్షిణకొరియా అసెంబ్లీ సంచలన నిర్ణయం
సియోల్: అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణకొరియా అధ్యక్షురాలు పార్క్ గియున్ హై అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీలో ఆమెపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. ఓ కుంభకోణంలో పార్క్ గియున్కు ప్రమేయముందని ఆరోపణలు రావడంతో దక్షిణకొరియాలో తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ అసెంబ్లీలో ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. పార్క్ గియున్కు గల అధికారాలన్నింటినీ తొలగించి ప్రధాన మంత్రికి బదిలీ చేస్తూ జాతీయ అసెంబ్లీలో నిర్ణయించారు. కాగా పదవి నుంచి పార్క్‌ను పూర్తిగా తొలగించాలా వద్దా అనే విషయాన్ని రాజ్యంగ కోర్టు నిర్ణయించనుంది. అప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతారు. -
దక్షిణ కొరియా ప్రధానికి ఉద్వాసన
సియోల్: దక్షిణ కొరియా ప్రధాని, ఆర్థిక మంత్రులను దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్–హై పదవుల నుంచి తప్పించారు. పార్క్ ఆప్తమిత్రురాలు చాయ్ సూన్–సిల్ అవినీతి కేసులో అరెస్టు కావడంతో దేశ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని హ్వాంగ్ క్యో–అహ్న్ను, ఆర్థిక మంత్రిని బుధవారం పదవుల నుంచి తప్పిస్తూ పార్క్ నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్స్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ కిమ్ బ్యోంగ్–జూన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. దక్షిణ కొరియాలో ప్రధాని పదవి నామమాత్రమైనది కాగా, అధ్యక్షులకే పూర్తి అధికారాలు ఉంటాయి. -
కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియా
సియోల్: జగడాలమారి ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా మరోసారి అణుపరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్టు తమకు సంకేతాలు అందినట్టు దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యున్ హై చెప్పారు. ఉత్తరకొరియా అణుపరీక్షల ఏర్పాట్ల నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని మిలటరీని ఆదేశించారు. గత జనవరిలో ఉత్తరకొరియా నాలుగో అణుపరీక్ష నిర్వహించింది. ఫిబ్రవరిలో ఒక ఉపగ్రహాన్ని బాలిస్టిక్ మిస్సైల్ సాంకేతికతతో లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టామని ప్రకటించింది. తాజాగా మరో అణుపరీక్ష చేసేందుకు ప్రయత్నిస్తోందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఉత్తర కొరియా చర్యలను గతంలో ఐక్యరాజ్య సమితి, నాటో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సారి ఈ దేశంపై కఠిన ఆంక్షలు విధించే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ అన్నారు. ఉత్తర కొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించనున్నట్టు ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
దక్షిణ కొరియాలో నిరసనలు- పరిస్థితి ఉద్రిక్తం
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఆందోళనకు కారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై విధానాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలమంది ప్రజలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధ్యక్ష భవనం వైపు దూసుకు వచ్చారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులపై వాటర కెనాన్లను ప్రయోగించారు. దీంతో ప్రదర్శనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దేశంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని ఆందోళన కారులు ఆరోపించారు. కార్మిక చట్టల్లో అవాంఛనీయమైన మార్పులు తీసుకొస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. చరిత్ర పాఠ్య పుస్తకాలను మార్చడం ద్వారా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.