దక్షిణ కొరియాలో నిరసనలు- పరిస్థితి ఉద్రిక్తం
Published Sat, Dec 5 2015 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఆందోళనకు కారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై విధానాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలమంది ప్రజలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధ్యక్ష భవనం వైపు దూసుకు వచ్చారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులపై వాటర కెనాన్లను ప్రయోగించారు. దీంతో ప్రదర్శనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
దేశంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని ఆందోళన కారులు ఆరోపించారు. కార్మిక చట్టల్లో అవాంఛనీయమైన మార్పులు తీసుకొస్తూ కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. చరిత్ర పాఠ్య పుస్తకాలను మార్చడం ద్వారా చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement