సియోల్: దక్షిణ కొరియా ప్రధాని, ఆర్థిక మంత్రులను దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్–హై పదవుల నుంచి తప్పించారు. పార్క్ ఆప్తమిత్రురాలు చాయ్ సూన్–సిల్ అవినీతి కేసులో అరెస్టు కావడంతో దేశ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని హ్వాంగ్ క్యో–అహ్‌న్‌ను, ఆర్థిక మంత్రిని బుధవారం పదవుల నుంచి తప్పిస్తూ పార్క్ నిర్ణయం తీసుకున్నారు.
ఫైనాన్స్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ కిమ్ బ్యోంగ్–జూన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. దక్షిణ కొరియాలో ప్రధాని పదవి నామమాత్రమైనది కాగా, అధ్యక్షులకే పూర్తి అధికారాలు ఉంటాయి.
దక్షిణ కొరియా ప్రధానికి ఉద్వాసన
Published Thu, Nov 3 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
Advertisement