సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య చారిత్రాత్మక భేటీ ముగిసింది. తాము గతాన్ని మరచి ముందడుగు వేయాలని నిర్ణయించామని, ప్రపంచం పెను మార్పును చూడబోతోందని సమావేశానంతరం కొరియా నేత కిమ్ ఉన్ వ్యాఖ్యానించారు. కెపెల్లా రిసార్ట్‌లో జరిగిన సింగపూర్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన అనంతరం ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు.
పూర్తి నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉందని కిమ్ ప్రకటించారు. ఈ క్షణం కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిందన్నారు. ఇది ఓ ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ మూవీలో సన్నివేశంగా పలువురు భావిస్తారని తమ భేటీ నేపథ్యంలో కిమ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు కిమ్‌తో తన భేటీని ఎవరూ ఊహించి ఉండరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువురి మధ్య మరిన్ని సంప్రదింపులు ఉంటాయని సంకేతాలు పంపారు. కిమ్‌ను వైట్ హౌస్‌కు ఆహ్వానిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment