వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ బుధవారం తొలిసారి వాషింగ్టన్‌లో అడుగు పెట్టారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో ఆయనతో భేటీ అయ్యారు. ఓవర్ ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికార మార్పిడికి సంబంధించిన ప్రాథమిక అంశాలు వారి నడుమ చర్చకు వచ్చినట్టు సమాచారం.
తన భార్య, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌తో కలిసి ‘వెల్‌కం బ్యాక్’ అంటూ ట్రంప్‌ను బైడెన్ స్వాగతించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు. అనంతరం నేతలిద్దరూ కరచాలనం చేసుకున్నారు. ‘‘రాజకీయా లు కఠినమైన వ్యవహారం. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
మెలానియా డుమ్మా
బైడెన్‌తో ట్రంప్ భేటీకి ఆయన భార్య మెలానియా డుమ్మా కొట్టారు. ట్రంప్‌పై నమోదైన రహస్య పత్రాల కేసులో బైడెన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతోనే ఈ సమావేశానికి ఆమె దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫ్లోరిడా నివాసంలో సోదాల సందర్భంగా మెలానియా వార్డ్ రోబ్‌ను అధికారులు అణువణువూ శోధించారు. ఆ క్రమంలో ఆమె లో దుస్తులున్న షెల్ఫ్‌ను కూడా వదిలి పెట్టలేదు. మెలానియా భేటీకి రాకున్నా ఆమెకు జిల్ అభినందన లేఖ రాశారు. దాన్ని ట్రంప్‌కు స్వయంగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment