కొరియా పునరేకీకరణ దిశగా! | Moon, Kim head to Mount Paekdu in friendship event | Sakshi
Sakshi News home page

కొరియా పునరేకీకరణ దిశగా!

Published Fri, Sep 21 2018 4:36 AM | Last Updated on Fri, Sep 21 2018 9:33 AM

Moon, Kim head to Mount Paekdu in friendship event - Sakshi

ప్యాంగ్యాంగ్‌లో ఉభయకొరియాల అధ్యక్షులు కిమ్, మూన్‌

ప్యాంగ్యాంగ్‌/సియోల్‌: ఇన్నాళ్లు ఉప్పు, నిప్పుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహ బంధం మెల్లిమెల్లిగా బలపడుతోంది.  ఇరుదేశాల ప్రజలు రెండు వైపులా ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఉభయ కొరియా దేశాల మధ్య 250 కిలోమీటర్ల మేర రెండు కిలోమీటర్ల వెడల్పుతో మిలటరీ రహిత ప్రదేశం (డీమిలటరైజ్డ్‌ జోన్‌ – డీఎంజెడ్‌) ఉంది. ఇందులో దక్షిణ కొరియా వైపు డీఎంఎజ్‌కు 650 మీటర్ల దూరంలో డోరాసాన్‌ రైల్వే స్టేషన్‌ ఉంది.

ఇదే అటువైపు చివరి స్టేషన్‌. కొంతకాలంగా ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇరుదేశాల జాతీయపతాకాలను పోలిన రిబ్బన్లను కడుతూ  సరిహద్దులు చెరిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. దక్షిణ కొరియా రైల్వే సంస్థ ‘కోరైల్‌’ ఇక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ‘ప్యాంగ్యాంగ్‌ 250 కి.మీ.లు, సియోల్‌ 56 కి.మీ.లు. దక్షిణంలో ఇదే చివరి స్టేషన్‌ కాదు. ఉత్తరాన్ని చేరుకునే తొలి స్టేషన్‌’ అని ఇరుదేశాలను కలిపేలా అర్థమొచ్చే సందేశాన్ని అందిస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్, ఉత్తరకొరియా నేత కిమ్‌ మధ్య మూడ్రోజులుగా జరుగుతున్న భేటీ గురువారం ముగిసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement