friendships
-
అన్ని స్నేహాలూ గొప్పవి కావు
సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.సారిక కష్టాలివీ... ⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. ⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది. ⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది. మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి... ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను. ⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది. ⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది. ⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది. ⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది. ⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది. ⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది. ⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది. ⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది. అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
ఇజ్రాయెల్–పాలస్తీనా శాంతికి కృషి
బెత్లెహం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో శుక్రవారం పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్ కాలనీల విస్తరణపై స్పందించలేదు. -
కొరియా పునరేకీకరణ దిశగా!
ప్యాంగ్యాంగ్/సియోల్: ఇన్నాళ్లు ఉప్పు, నిప్పుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహ బంధం మెల్లిమెల్లిగా బలపడుతోంది. ఇరుదేశాల ప్రజలు రెండు వైపులా ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఉభయ కొరియా దేశాల మధ్య 250 కిలోమీటర్ల మేర రెండు కిలోమీటర్ల వెడల్పుతో మిలటరీ రహిత ప్రదేశం (డీమిలటరైజ్డ్ జోన్ – డీఎంజెడ్) ఉంది. ఇందులో దక్షిణ కొరియా వైపు డీఎంఎజ్కు 650 మీటర్ల దూరంలో డోరాసాన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇదే అటువైపు చివరి స్టేషన్. కొంతకాలంగా ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇరుదేశాల జాతీయపతాకాలను పోలిన రిబ్బన్లను కడుతూ సరిహద్దులు చెరిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. దక్షిణ కొరియా రైల్వే సంస్థ ‘కోరైల్’ ఇక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ‘ప్యాంగ్యాంగ్ 250 కి.మీ.లు, సియోల్ 56 కి.మీ.లు. దక్షిణంలో ఇదే చివరి స్టేషన్ కాదు. ఉత్తరాన్ని చేరుకునే తొలి స్టేషన్’ అని ఇరుదేశాలను కలిపేలా అర్థమొచ్చే సందేశాన్ని అందిస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్, ఉత్తరకొరియా నేత కిమ్ మధ్య మూడ్రోజులుగా జరుగుతున్న భేటీ గురువారం ముగిసింది. -
గ్యాంగ్‌స్టర్ మధుతో ‘పల్లె’ దోస్తీ!
– బెంగళూరు కేంద్రంగా మధు సెటిల్మెంట్లు, భూదందాలు – భూదందాలో రియల్టర్ మంజునాథ్‌తో విభేదాలు – మధును కిడ్నాప్ చేసి చితకబాదిన మంజు గ్యాంగ్ – సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న మధు వీడియోలు – మధుతో మంత్రి పల్లెతో పాటు మరికొందరు టీడీపీ నేతలకు సంబంధాలు – గ్యాంగ్‌స్టర్ భానుకిరణŠ కూ మధు సన్నిహితుడు.. మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన సాక్షి – సూరి హత్యకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం! – పూర్తి వీడియోను బయటపెడితే వెలుగులోకి వాస్తవాలు.. (సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంతపురం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎర్లంపల్లి మధు వ్యవహారాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండగా నిలిచారా? మంత్రి మద్దతుతోనే మధు సెటిల్మెంట్లు, భూదందాలు నిర్వహించారా? పల్లెతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు అతని అండతో సెటిల్మెంట్లు చేశారా? సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్న మధు వీడియో, దాని వెనుక ఉన్న పరిణామాలు బేరీజు వేస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ వీడియో ఫేస్బుక్, వాట్సాప్‌లలో రెండురోజులుగా హల్చల్ చేస్తోంది. ఎవరీ మధు? ఎర్లంపల్లి మధు పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం ఎర్లంపల్లి వాసి. మద్దెలచెరువు సూరి కారు డ్రైవర్‌గా ఉండేవాడు. భానుకిరణ్.. సూరిని కారులో తుపాకీతో కాల్చి చంపిన సమయంలోనూ మధునే కారుడ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా పలుసార్లు కోర్టుకు హాజరయ్యాడు. సూరి హత్య తర్వాత భానుకిరణ్ అనుచరునిగా ఉంటూ బెంగళూరుకు మకాం మార్చాడు. భాను పేరుతో సెటిల్మెంట్లు, భూదందాలు చేస్తుండేవాడు. తర్వాత మంత్రి పల్లె రఘునాథరెడ్డి తనకు సన్నిహితుడని చెబుతూ దందాలు చేసేవాడు. మంత్రి పల్లె కూడా సహకరించేవారనే ఆరోపణలున్నాయి. మంత్రితో పాటు ‘అనంత’కు చెందిన మరికొంతమంది టీడీపీ నేతలు సెటిల్మెంట్లు, భూదందాలకు సంబంధించిన వ్యవహారాలను మధుతో పరిష్కరిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మధును కిడ్నాప్ చేసిన బెంగళూరు రియల్టర్ మంజునాథ్ బెంగళూరుకు చెందిన రియల్టర్ మంజునాథ్‌కు సంబంధించిన రూ.50 కోట్ల భూమి వ్యవహారంలో మధు జోక్యం చేసుకున్నాడు. పక్కకు తప్పుకోవాలని మంజునాథ్ గ్యాంగ్ హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట మధు వాకింగ్ చేస్తుండగా.. మంజునాథ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, అజ్ఞాతంలోకి తీసుకెళ్లింది. దుస్తులు ఊడదీసి చితకబాదింది. సెటిల్మెంట్లు చేస్తావా? మా విషయంలో జోక్యం చేసుకుంటావా? అని తిడుతూ చావబాదారు. దెబ్బలు తట్టుకోలేక మధు తప్పయిపోయిందని, వదిలిపెట్టాలని, మళ్లీ సెటిల్మెంట్ల జోలికి వెళ్లనని విలపించాడు. ఈ దశ్యాలన్నీ మంజునాథ్ గ్యాంగ్ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి హల్చల్ చేస్తున్నాయి. పల్లె సమక్షంలో టీడీపీలో చేరిక 2014 ఎన్నికలకు ముందు పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో మధు టీడీపీ కండువా వేసుకున్నాడు. ఎన్నికల్లో పల్లె విజయానికి కషి చేశాడు. పల్లె బెంగళూరుకు వెళితే అక్కడ మధునే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసేవాడని తెలుస్తోంది. పలు సెటిల్మెంట్లను కూడా మధుతో పల్లె చేయించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అతనితో పల్లె రఘునాథరెడ్డి సంబంధాలు, భూదందాలపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పల్లెకు వందల ఎకరాల భూములు ఉన్నాయని, వీటిని గ్యాంగ్‌స్టర్ మధు అండతోనే పంచాయితీలు చేసి కారుచౌకగా కొట్టేశారని పలువురు ఆరోపిస్తున్నారు. పల్లె ఏమన్నారంటే.. మధుతో సంబంధాలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. అతనితో తనకు పరిచయం ఉందని, ఎన్నికల్లో తన విజయానికి సాయం చేశారని అంగీకరించారు. అయితే.. నేరాలు, గూండాయిజాన్ని తాను ప్రోత్సహించలేదన్నారు. బెంగళూరుకు వెళ్లినపుడు మీకు ఏర్పాట్లన్నీ మధునే చేస్తారంటకదా అనే ప్రశ్నకు బదులిస్తూ...తాను బెంగళూరుకు వెళితే హలో అంటే హలో అంటానన్నారు. సూరి హత్య విషయాలనూ వెల్లడించిన మధు? బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ మధును చితకబాదుతూ సూరిని ఎలా, ఎందుకు హత్య చేశారో చెప్పాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను కూడా వెల్లడించినట్లు సమాచారం. ఈ వీడియో వెలుగులోకి వస్తే సూరి హత్య సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మధు వెల్లడించిన అంశాలు కీలకంగా మారే అవకాశముంది. ఈ విషయం ప్రస్తుతం అనంతపురంలో కలకలం రేపుతోంది. -
పొరుగుబంధం పెరుగుతోంది
భాగ్యనగరవాసుల మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాల వారధి ‘బిజీ’వితంలోనూ చుట్టుపక్కల వారి పట్ల పెరుగుతున్న ఆత్మీయత ఇరుగిల్లు ఎవరిదో పొరుగింట్లో ఎవరుంటారో తెలియనంత బిజీగా ఉరుకులు పరుగుల మధ్య జీవితాన్ని గడిపేసే నగరవాసి మనస్తత్వంలో మార్పు వస్తోంది. పలకరింపులు కూడా మహాభాగ్యంగా మారిన నగర జీవనాల్లో పాతకాలపు బాంధవ్యాలు మళ్లీ చిగురిస్తున్నాయి. చుట్టుపక్కల వారితో స్నేహ సంబంధాలు పెంచుకుంటూ ఆత్మీయతను పంచుకునే పరిణతి భాగ్యనగర వాసిలో పెరుగుతోంది. పండుగలు పబ్బాలకు తరచుగా కలుస్తుండటం.. ఆపదల్లో పరస్పరం చేదోడు వాదోడుగా ఆదుకోవటం.. గొడవలకు తావివ్వకుండా స్నేహపూర్వకంగా మెలగటం వంటి బంధాలు నిదానంగానైనా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే.. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరుగుపొరుగులతో అనుబంధం అనే అంశంపై హైదరాబాద్ నగరంలో ‘సాక్షి’ నిర్వహించిన శాంపిల్ సర్వే ఫలితాల సారాంశమిదీ... గల్లీలో అందరూ గుర్తే: ఒకే వీధి/గల్లీ/సందు/కాలనీలో తమతో పాటు నివసిస్తున్న అందర్నీ గుర్తుపట్టగలమని 64 శాతం మంది నగరవాసులు అంటున్నారు. అయితే గుర్తుపట్టలేమనే వారు 26 శాతం ఉంటే.. అసలు గుర్తు పట్టాల్సిన అవసరమే లేదని పది శాతం మంది ఉన్నారు. సన్నిహితులూ ఎక్కువే: చుట్టుపక్కల ఉన్నవారిలో పరిచయానికే పరిమితం కాకుండా సన్నిహితంగా మెలిగే వ్యక్తుల సంఖ్య పది మందికన్నా ఎక్కువని చెప్తున్న వారు 73 శాతం మంది ఉండటం విశేషం. ఇద్దరు ముగ్గురు సన్నిహితులు ఉన్నట్లు 25 శాతం మంది చెప్తే.. ఎవ్వరూ లేరనే వారు రెండు శాతం మంది. శుభకార్యాలకు తరచూ పిలుపులు: ఇరుగుపొరుగు వారు శుభకార్యాలకు పరస్పరం తరచుగా ఆహ్వానాలు ఇచ్చిపుచ్చుకుంటున్న వారు 48 శాతం మంది ఉంటే.. అప్పుడప్పుడూ ఆహ్వానాలు అందుకునే వారు 39 శాతం మంది ఉన్నారు. అసలు అలాంటి ఆహ్వానాలేవీ లేవనే వారి సంఖ్య 13 శాతం ఉండటం విశేషం. ఆపదల్లో ఆదుకోవటానికి సిద్ధం: చుట్టుపక్కల ఉన్న వారికి ఏదైనా ఆపద వస్తే ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటామనే వారు 50% మంది ఉండటం మంచి పరిణామం. వారు బాగా కావాల్సిన వారైతేనే ఆదుకోవటానికి సిద్ధపడేవారు 42% మంది ఉన్నారు. మరో 8 శాతం మంది తమకెందుకులే అని మిన్నకుంటామని చెప్తున్నారు. వంటలు పంచుకోవటం తక్కువే: ఇరుగుపొరుగుతో పిండివంటలు పంచుకోవటం చాలా అరుదని, అసలు లేదని చెప్తున్న వారి శాతం 64% దాకా ఉంది. తరచుగా పంచుకునే వారు 36% మంది ఉన్నారు. క్లీన్ అండ్ పీస్: తమ వీధిలో చుట్టుపక్కలవారి మంచితనం తమకు బాగా ఇష్టమనే వారు 34 శాతం మంది ఉంటే.. వీధి ప్రశాంతంగా ఉండటం (33 శాతం మంది), పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం (33 శాతం మంది) ఇష్టపడే వారు రెట్టింపు ఉన్నారు. వారూ మా కుటుంబమే..: చుట్టుపక్కలవారిని కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తామనే వారు కూడా 24 శాతం మంది ఉండటం విశేషం. అయితే.. పొరు గు వారిని పరిచయస్తులుగా మాత్రమే పరిగణిస్తామనే వారే ఎక్కువగా 68% మంది ఉన్నారు. పూర్తిగా అపరిచితుల్లాగే చూస్తామనే వారు 8% మంది ఉన్నారు. పొరుగుతో తగవులు పడం: ఇరుగుపొరుగు వారితో తగాదాలకు దూరంగా ఉంటామంటున్న నగరవాసుల సంఖ్య 45 శాతంగా ఉంది. ఒకవేళ ఏదైనా గొడవ వచ్చినా ఆ మరుసటి రోజే మరిచిపోతామనే వారు 33 శాతం మంది ఉంటే.. ఒకసారి గొడవపడితే ఇక గొడవేననే వారు 13 శాతం మంది ఉన్నారు. - - హైదరాబాద్, సాక్షి