సాక్షి, సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం చేసిన క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను ఆందోళనల్లోకి నెట్టేసింది. జపాన్ ద్వీపమైన హోక్కాయ్ మీదుగా ప్రయాణించిన క్షిపణి పసిఫిక్ సముద్ర జలాల్లో మూడు భాగాలుగా విడిపోయి పడింది. అయితే, ఈ క్షిపణి ప్రయోగం గురించి దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్‌కు ముందే సమాచారం ఉంది. దీంతో ఆ దేశం ముందు జాగ్రత్త చర్యగా.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దులో బాంబుల వర్షం కురిపించింది.
సరిహద్దులో బాంబుల వర్షం
మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సరిహద్దులో బాంబుల వర్షం కురిపించి తమ శక్తి సామర్ధ్యాలను కిమ్ కి తెలియచేయాలని దక్షిణ కొరియా భావించింది. సరిహద్దులో ఎనిమిది బాంబులను వేసే ప్రక్రియకు అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆదేశాల మేరకే జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్15 కే ఫైటర్ జెట్ల ద్వారా ఎనిమిది మార్క్ 84 బాంబులను సరిహద్దులో వేస్తామని దక్షిణి కొరియా తెలిపింది.
వణికిపోయిన జపాన్
మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా చేసిన ప్రయోగానికి జపాన్ వణికిపోయింది. దేశం మీదకు క్షిపణి వస్తోందని ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
కిమ్ దేశ సరిహద్దులో బాంబుల వర్షం!
Published Tue, Aug 29 2017 11:27 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
Advertisement
Advertisement