
బోండిలా: అభివృద్ధికి శాంతియే మూల మని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ నొక్కి చెప్పారు. శాంతికి ప్రాధా న్యత ఇస్తేనే అభివృద్ధికి పునాది ఏర్పడు తుందని ఆమె పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని దక్షిణ కామెంగ్ జిల్లా బోండిలా లో బుద్ధ మహోత్సవాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో కలసి ఆమె శనివారం ప్రారం భించారు. అనంతరం నిర్మలా సీతా రామన్ మాట్లాడుతూ.. అభివృద్ధి సాధిం చాలంటే శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
‘అరుణాచల్ ప్రదేశ్, దాని సరిహద్దుల్లో ఎలాంటి అవసరం ఏర్పడినా కేంద్రం వెంటనే స్పందిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజ లకు మేం (కేంద్రం) అండగా ఉన్నాం. దేశ సరిహద్దులను కాపాడటంలో ఈ రాష్ట్ర ప్రజలే నిజమైన కాపలాదారులు. ఇక్కడి ప్రజలు ప్రకృతితో మమేకమై జీవించడం గొప్పగా ఉంది. మొదట నేను భారత దేశ పౌరురాలిని. ఆ తర్వాతే కేంద్ర మంత్రిని’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దక్షిణ కామెంగ్ జిల్లా అభివృద్ధికి సహకరి స్తామని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment