'ఓ కోడలుగా, ఎంపీగా బాధ్యతను నెరవేరుస్తున్నా'
హైదరాబాద్: తమిళనాడును విడిచిపెట్టి ఏపీని కర్మభూమిగా భావించి ఓ కోడలుగా, ఎంపీగా నా బాధ్యతను నెరవేరుస్తున్నానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆమె అన్నారు. ఎటువంటి ఆదాయం, రాజధాని, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా ఉన్న ఏపీ అభివృద్దికి చాలా కృషి చేయాల్సి ఉంటుందన్నారు.
విశాఖ - చెన్నైను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా కేంద్రం ప్రకటించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాకినాడలో హార్డ్‌వేర్ హబ్, పీపీపీ పద్ధతిలో స్కిల్ డెవలప్ మెంట్ హబ్. చిత్తూరులో హార్టికల్చరల్ హబ్, పెట్టాలనే ఆలోచన ఉందన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో డెవలప్‌మెంట్ కనిపిస్తుందని నిర్మలాసీతారామన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజమండ్రి, చిత్తూరులలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆ శాఖ మంత్రిని త్వరలోనే తీసుకొస్తానని హామీ ఇచ్చారు.