
శాంతికాముకులు జాతి వ్యతిరేకం కాదు
- భారత్–పాక్ మధ్య శాంతి నెలకొనాలి
- ‘పీస్ నౌ అండ్ ఫరెవర్’లో వక్తల పిలుపు
- ఇరుదేశాల్లో శాంతిని కోరుతూ మొదలైన కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌తో సత్సంబంధాలు, ప్రజల మధ్య శాంతిని కాంక్షించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో జాతి వ్యతిరేక చర్యగా చూస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శాంతికాముకులు జాతి వ్యతిరేకులు కాదని స్పష్టంచేశారు. భారత్–పాక్ మధ్య శాంతిని కోరుతూ శనివారం ఇరుదేశాల్లోని పలు పట్టణాల్లో ‘పీస్ నౌ అండ్ ఫరెవర్’ పేరిట ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టినట్టు పీస్ నౌ క్యాంపెయిన్ కన్వీనర్, కోవా స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజర్ హుస్సేన్ తెలిపారు. జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని కోవా సంస్థ హైదరాబాద్‌లోని నారాయణగూడ వైఎంసీఏ లో ప్రారంభించింది.
రెండు దేశాల్లోని శాంతి కాముకులందరూ ఇందులో పాలుపంచుకుం టున్నట్టు మజర్ వివరించారు. ఈ కార్యక్రమా న్ని భారత నేవీ మాజీ చీఫ్, మెగసెసె అవార్డు గ్రహీత అడ్మిరల్ రాందాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో ఇరు దేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయ న్నారు. అందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. పేద దేశాలైన భారత్, పాకిస్తాన్లు రక్షణ వ్యయంపై చేసే ఖర్చును తమ తమ దేశాల్లో పేదరికాన్ని నిర్మూలిం చేందుకు, అక్షరాస్యతను పెంచేందు కు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఖర్చు చేస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యేదని డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. నేడు ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదని, పాలకులు వారి అభిప్రాయాలను ప్రజలపై రుద్దకూడదని హితవు పలికారు.
ఇరుదేశాల మధ్య సంబం ధాలు మెరుగవుతు న్నాయన్న సమయంలో యుద్ధోన్మాద ప్రకట నలు వెలువడుతుండడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. మాజీ ఎంపీ, సీపీఐ నాయకులు అజీజ్ పాషా మాట్లాడుతూ.. ప్రజల కనీస అవసరాలను తీర్చినప్పుడే ఇరుదే శాల్లో శాంతి సాధ్యమవు తుందన్నారు. ప్రజలంతా యుద్ధాన్ని వ్యతిరే కించాలని, శాంతిని కోరుకోవాలని అన్నారు.
సహజంగా పాక్–భారత్ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని శాంతి, ప్రేమతత్వాన్ని మర్చి పోయిన పాలకులు.. ప్రస్తుత పరిస్థితులను యుద్ధం దిశగా తీసుకెళ్తున్నారని విమర్శించా రు. పీస్ నౌ అండ్ ఫరెవర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌తో పాటు విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు, అహ్మ దాబాద్, భోపాల్, భువనే శ్వర్, గువాహటి, జైపూర్, రాంచీ, సిమ్లా, కోల్‌కతా, జమ్మూ తదితరచోట్ల ప్రారంభించా రు. పాక్‌లో కరాచీ, లాహోర్, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రారంభించారు.