సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ KA Paul మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని, అవినీతిని నిలదీస్తున్నందునే తనను కలవడానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అంటున్నారాయన.
సదాశివపేట పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేసి.. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికే.. కేసీఆర్, కేటీఆర్‌లు మానవ హక్కులు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. ధరణి తీసుకువచ్చి మా ఛారిటీ భూములను లాక్కున్నాడు. కేసీఆర్‌ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయపడి నన్ను కేసీఆర్ కలవలేదు అని అన్నారాయన.
ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒకటేనన్న ఆయన.. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడమే అందుకు నిదర్శమని చెప్పారు. అధికార బీఆర్‌ఎస్ తనను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారాయన. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను. నా డబ్బు అంతా అమెరికాలో ఉండిపోయింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా’ అని చెప్పారాయన.
గత 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్న కేఏపాల్.. వారం రోజుల్లో వాటికి చైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్‌ను మానవ హక్కుల కమిషన్ గా తాను రికమండ్ చేస్తానని చెబుతూ.. లైవ్‌లోనే ఆయనకు ఫోన్ చేసి మరీ ‘మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా?’ అని అడిగారు.
ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన కేఏ పాల్‌ను.. అపాయింట్‌మెంట్ లేదని చెబుతూ సెక్యూరిటీ గేట్ బయటే అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదీ చదవండి: బీజేపీ బలం సెన్సెక్స్ కాదు
Comments
Please login to add a commentAdd a comment