సినిమాలు తీసి అప్పులు తీర్చాలనుకోవడం అమాయకత్వం | - | Sakshi
Sakshi News home page

సినిమాలు తీసి అప్పులు తీర్చాలనుకోవడం అమాయకత్వం

Published Thu, Aug 3 2023 2:28 AM | Last Updated on Thu, Aug 3 2023 11:47 AM

- - Sakshi

రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్‌ను నాశనం చేస్తున్న బీజేపీతో నడుస్తున్న పవన్‌ కల్యాణ్‌.. రాష్ట్రానికి చేసిందేమీ లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరంజీవి మంత్రి పదవి కోసం ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్‌కు తాకట్టు పెడితే, తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ కాపులు, బీసీలు, దళితులను బీజేపీకి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

సినిమాలు తీసి ఆంధ్రప్రదేశ్‌ అప్పు తీర్చగలనని అనుకోవడం పవన్‌ కల్యాణ్‌ అమాయకత్వమన్నారు. వరద భాదితులకు కనీసం రెండు, మూడు నెలలకు సరిపడా నిత్యవసరాలను ప్రభుత్వం అందజేయాలన్నారు. రైతులకు పంట నష్టపరిహారం కింద కనీసం రూ.లక్ష చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తన పార్టీకి అవకాశం ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న అప్పులను మూడేళ్లలో తీర్చేస్తానని పాల్‌ ప్రకటించారు. తనను ఎంపీగా గెలిపించి లోక్‌సభకు పంపితే సత్తా చూపిస్తానని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement