పవన్‌..సేవలందించే మాపై నిందలా | - | Sakshi
Sakshi News home page

పవన్‌..సేవలందించే మాపై నిందలా

Jul 11 2023 8:02 AM | Updated on Jul 11 2023 8:02 AM

- - Sakshi

రాజమహేంద్రవరం సిటీ: కరప: పవన్‌ కల్యాణ్‌ ఏలూరు సభలో తమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో వలంటీర్లు భగ్గుమన్నారు. ఆయన దిగజారుడు వ్యాఖ్యలను చేశారంటూ వివిధ రీతుల్లో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంతోపాటు పలు మండలాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్న వలంటీర్లను నేరస్తులంటూ వ్యాఖ్యానించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని రాజమహేంద్రవరంలో వార్డు వలంటీర్లు హెచ్చరించారు.

గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ చిత్రాన్ని చెప్పులతో కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో వలంటీర్లతో పాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరిఫ్‌, మార్తి లక్ష్మి, పీతా రామకృష్ణ, బర్రే కొండబాబు, నక్కా నాగేష్‌, మార్తి లక్ష్మి, పీతా రామకృష్ణ, అన్నపూర్ణ రాజు, బాలాజీ రెడ్డి, మార్గాని సురేష్‌ పాల్గొన్నారు.

అనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు
అనపర్తి:
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వలంటీర్లు డిమాండ్‌ చేస్తూ, కళావేదిక వద్ద నుంచి అనపర్తి దేవీచౌక్‌ సెంటర్‌కు చేరుకొని కెనాల్‌ రోడ్డుపై మానవహారం నిర్వహించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌కల్యాణ్‌ వలంటర్లకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి చిర్ల వీర్రాఽఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక తేతలి రామిరెడ్డి, మంగాయమ్మ కళావేదిక ప్రాంగణంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కొవ్వూరులో దిష్టిబొమ్మ దహనం
కొవ్వూరు:
కొవ్వూరు మెరకవీధి సెంటర్లో సోమవారం వలంటీర్లు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.మానవహారంగా ఏర్పడి పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి హోరెత్తించారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్‌ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పవన్‌ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. పవన్‌ దిష్టిబొమ్మకు పెట్రోలు పోసి నిప్పంటించారు. తన వైఖరిని మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది వలంటీర్లు ఆందోళనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement