సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులను చేస్తూ అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసింది చూశాం. అయితే ఈ పరిణామంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించారు. బహుశా చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మరిచిపోయి అలా ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఆ టైంలో ప్రధాని, పవన్‌లతో చంద్రబాబు పొలిటికల్ ర్యాలీతో బిజీగా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన. కాబట్టి చంద్రబాబే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఘటనకు బాధ్యులను చేస్తూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తానే సీఎం అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు.
చంద్రబాబు(Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు.. 2019లో పుష్కరాల సమయంలో 20 మందికి పైగా చనిపోయారు.. మరెందరో గాయపడ్డారు. కందుకూర్లో పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తే అక్కడా చనిపోయారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తే ముగ్గురు చనిపోయారు. తారకరత్న కూడా చంద్రబాబు ర్యాలీలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు.
సమస్యలను పక్కన పెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment