సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్స్ చేశారు.
కాగా, కేఏ పాల్ బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. చంద్రబాబు అవినీతిలో ఆయన కుమారుడు నారా లోకేష్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించాల్సిందే. డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలు పెయిడ్ ఉద్యమాలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబుకు నిజంగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయాలన్నారు. కేవలం 25 సీట్ల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్ముడుపోయాడని తీవ్ర విమర్శలు చేశారు. ప్యాకేజీ కోసమే కాపులను పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..
Comments
Please login to add a commentAdd a comment