నన్ను చంపాలని చూస్తున్నారు.. భద్రత పెంచండి | KA Paul letter To Prime Minister and Home Minister | Sakshi
Sakshi News home page

నన్ను చంపాలని చూస్తున్నారు.. భద్రత పెంచండి

Published Mon, Oct 21 2024 10:54 AM | Last Updated on Mon, Oct 21 2024 11:39 AM

KA Paul letter To Prime Minister and Home Minister

ప్రధాని, హోం మంత్రులకు  కేఏ పాల్‌ లేఖ 

సాక్షి, న్యూఢిల్లీ: తనను కొందరు చంపాలని చూస్తున్నారని, భద్రత పెంచాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, కాంగ్రెస్‌ పార్టీ, సహా మోదీ కూడా తనకు శత్రువులే అని పేర్కొన్నారు. 

ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపితే స్వర్గానికి పోతా..మీరు (చంపాలనుకున్నవారు) చస్తే నరకానికి పోతారు’అంటూ వ్యాఖ్యానించారు. పలు విషయాలపై తాను కేసులు వేస్తూ పోరాడుతున్నానని, ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, పవన్‌ సహా.. బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఇంటెలిజెన్స్‌ నివేదికలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని తెలిపారు. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని కేఏపాల్‌ డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వేలాది మంది గ్రూప్‌–1 అభ్యర్థులపై పోలీ సులు దాడులు చేయడం అమానుషమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement