సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో కుకి మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హేయమైన ఘటనలు, బృంద హింసపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సామా జిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
‘మహిళలు, పిల్లలను తాలిబాన్లు అగౌరవ పరుస్తున్నపుడు భారతీయులుగా మనందరం ఆందోళన చెందాం. కానీ ప్రస్తుతం మన సొంత దేశంలోనే మెయితీ గుంపులు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధింపులకు గురి చేయడం అత్యంత హేయం. మనసు కలిచి వేసే ఇలాంటి అనాగరిక ఘటనలు నయా భారత్‌లో సాధారణంగా మారు తున్నాయి. ప్రధాని, హోంమంత్రి, కేంద్ర ప్రభు త్వం మౌనముద్ర వహించడంతో మణి పూర్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి భయాన కమైన హింసకు దారితీసింది. మణిపూర్ మంటలను ఆర్పేందుకు ప్రధాని, హోంమంత్రి అన్ని అంశాలను పక్కన పెట్టి శక్తిని, సమయాన్ని వెచ్చించాలి.. నాగరిక సమాజంలో హింసకు తావులేదనే సందేశాన్ని పంపాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment