సంగారెడ్డి: పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ్ముడు జగ్గారెడ్డి.. ‘‘రూ.వెయ్యి కోట్లు తీసుకొని స్వార్థం కోసం బీఆర్‌ఎస్‌లో చేరుతావో.. సంగారెడ్డి అభివృద్ధి కోసం ప్రజాశాంతి పార్టీలోకి వస్తావో నిర్ణయించుకోవాలని’’సవాల్ విసిరారు. జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరితే నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న చింతప్రభాకర్ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభాకర్ తన పార్టీలోకి వస్తే ఏటా రూ.కోటి తన సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు.
లిక్కర్ స్కాం కేసుపైనా వ్యాఖ్యలు..
లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు అంశాన్ని కూడా కేఏ పాల్ ప్రస్తావించారు. కేసీఆర్ తన కూతురు కవితను అరెస్టు చేయకపోతే బీజేపీకి 40 సీట్లు ఇస్తానని అన్నారని పాల్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీం అని విమర్శించారు. బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన స్వార్థం కోసం టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారని పాల్ ఆరోపించారు. రూ.వేల కోట్లు సంపాదించుకున్న రేవంత్‌కు ఓటు బ్యాంకు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment