
తుకారాంగేట్ మరాఠా బస్తీలో పర్యటిస్తున్న కేఏ పాల్
హైదరాబాద్: తనకు అవకాశమిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. ఇక్కడి నుంచే ప్రజాశాంతి తరుపున పోటీ చేస్తానని, ప్రజలు తనను ఆదిరించాలని కోరారు. సోమవారం అడ్డగుట్ట డివిజన్‌లోని తుకారాంగేట్ మరాఠా బస్తీలో ఆయన పర్యటించి స్థానికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క అంశం కూడా నెరవేర్చే విధంగా లేవన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ తరపున బరిలో ఉండాలని కోరుకునే వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment