KA Paul Sensational Comments Over Pawan Kalyan - Sakshi
Sakshi News home page

పవన్‌పై కేఏ పాల్‌ సంచలన కామెంట్స్‌

Published Fri, Aug 18 2023 7:29 AM | Last Updated on Fri, Aug 18 2023 8:35 AM

KA Paul Sensational Comments Over Pawan Kalyan - Sakshi

సాక్షిప్రతినిధి, సంగా­రెడ్డి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో  ఉ­న్న­ప్పుడు సినీ­నటుడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ­ని కాంగ్రెస్‌లో విలీనం చేశారని, అదే తరహాలో ఆయన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీని బీజేపీలో కలిపే­స్తారని కేఏ పాల్‌ ఆరోపించారు. 

అయితే, పవన్‌ రూ.ఐదు వేల కోట్ల డబ్బులు, క్యాబినెట్‌లో పొజిషన్‌ తీసుకుని బీజేపీలో కలిపేస్తారని చెప్పారు. గురువారం తెలంగాణలోని సంగారెడ్డిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్‌ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ ప్యాకేజీ స్టార్‌ అని ఎద్దేవా చేశారు. మీడియాలో నీతి కబుర్లు చెబుతున్న చిరంజీవి. తన కూతురు ఓ బ్రాహ్మణున్ని పెళ్లి చేసుకుంటే అతడ్ని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ప్యాకేజీ స్టార్‌లు కావాలా? రియల్‌ హీరో కావాలా? సినీహీరో కావాలా? వరల్డ్‌ హీరో కావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాల, మాదిగలను విడగొట్టినది మాజీ సీఎం చంద్రబాబు అని కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బల ప్రదర్శన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement