‘ఫిరాయింపుల’ మీద కేఏ పాల్ పిటిషన్‌పై స్పష్టం చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టప్రకారం మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉత్త ర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఈ మేరకు దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయి స్తున్నారని.. ఇలాంటి వారి శాస నసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదే శాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ఆదేశాలి వ్వాలని పాల్ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీని వాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించాలని కేఏ పాల్ కోరారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ అధికారాల్లో జోక్యం కోరుతూ వేసిన ఈ పిటిషన్ చెల్లదని, మధ్యంతర ఉత్తర్వులు కోరలేరని అన్నారు. పలువురి అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment