రేవంత్‌.. ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: కేటీఆర్‌ | BRS KTR Serious Comments Over Revanth Govt | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా?: కేటీఆర్‌

Published Thu, Dec 12 2024 10:07 AM | Last Updated on Thu, Dec 12 2024 11:30 AM

BRS KTR Serious Comments Over Revanth Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్‌. రేవంత్‌.. మీది ప్రభుత్వమా లేక అబద్ధాల ఫ్యాక్టరీనా అని ప్రశ్నించారు. అలాగే, కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా? అంటూ మండిపడ్డారు. అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు అంటూ ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..

  • రేవంత్‌.. మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?

  • మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం..

  • అర్దసత్యాలు..అభూతకల్పనలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు!

  • కాకిలెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా?

  • 50 వేల కోట్లు, 65 వేల కోట్లు వడ్డీలు అని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం?

  • RBI Handbook of India States బట్టి తెలంగాణ అప్పు ఎంత వుందో తేటతెల్లమవుతుంది!

  • ఢిల్లీకి మూటలు మూసేందుకా? నీ జేబు నింపుకునేందుకా? అబద్ధానికి అంగు లాగీ వేస్తే రేవంత్ అని మళ్లీ నిరూపించుకున్నారు!

  • Lies, more lies and nothing but LIES! అంటూ ఘాటు విమర్శలు చేశారు.

 

  • ఇదే సమయంలో 

    ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.

  • కోతలు కాదు, కూతలు కాదు.. చేతలు కావాలి.

  • అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు..ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

  • అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారు.

  • ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేదు.

  • అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు.

  • పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను .. ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశారు

  • ఇప్పటికైనా కల్లు తెరవండి ..

  • వర్షం కురుస్తుందో ? లేదో ?

  • సాగునీరు అందుతుందో ? లేదో ?

  • కరంటు వస్తుందో ? లేదో ?

  • పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో ? లేదో తెలియకున్నా

  • భూమిని నమ్మి సేద్యం చేసి .. ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వండి

  • అమ్మల విషయంలో అన్నదాతల విషయంలో వివక్ష చూపకండి..

  • పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకకండి

  • జై కిసాన్.. జై తెలంగాణ అంటూ కామెంట్స్‌ చేశారు. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement