సన్న వడ్లకు 500 బోనస్‌.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు | CM Revanth Reddy Key Comments Over Paddy Purchases In Telangana | Sakshi
Sakshi News home page

సన్న వడ్లకు 500 బోనస్‌.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Published Thu, Oct 3 2024 5:14 PM | Last Updated on Thu, Oct 3 2024 5:37 PM

CM Revanth Reddy Key Comments Over Paddy Purchases In Telangana

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. సన్నవడ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు.

సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు కూడా పెట్టాలి. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఐకేపీ సెంటర్లకి సీరియల్ నెంబర్లు ఇవ్వాలి. సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి. 

ధాన్యం కోసం గోనె సంచులు అందుబాటులో ఉండాలి. ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగం కావాలి. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు ప్రతీరోజూ రెండు గంటల పాటు ధాన్యం కొనుగోలుపైన సమీక్ష జరపాలి. ధాన్యం కొనుగోళ్లపైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే. 

ధాన్యంలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలి. వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు ఏర్పాట్లు చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement