
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్బంగా ఈనెల 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.
కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు వ్యాజ్యంలో కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ దృష్ట్యా 24వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.