దాడిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు | YSRCP MlAs complaint against telangana congress mlas to Speaker | Sakshi
Sakshi News home page

దాడిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

Published Mon, Dec 16 2013 12:07 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

దాడిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు - Sakshi

దాడిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సభాపతి నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సభాపతి నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారు. టీ.కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు మీడియా ప్రతినిధులు కూడా తమపై దాడికి పాల్పడినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదుపై స్పందించిన స్పీకర్.... మీడియా ఫుటేజ్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో స్పీకర్ .... పోలీసు ఉన్నతాధికారులను తన ఛాంబర్కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. తక్షణమే బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement