టీ బిల్లు చర్చపై విధివిధానాలు
కసరత్తు చేపట్టిన స్పీకర్
బీఏసీ వుుందు పెట్టి ఆపై చర్చ
గడువులోగా ముగించాలన్న యోచనలో నాదెండ్ల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చను కొనసాగించేందుకు అవసరమైన విధివిధానాలపై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ కసరత్తు చేపట్టారు. జనవరి మూడో తేదీనుంచి అసెంబ్లీ శీతాకాల మలివిడత సమావేశాలు ప్రారంభం కానుండడంతో అంతకు ముందే ఈ విధివిధానాలను ఖరారుచేసి సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) ముందు పెట్టాలని ఆయున భావిస్తున్నారు. బీఏసీలో చర్చించిన పిదప అవసరమైన మార్పులు చేపట్టి చర్చను పూర్తిచేరుుంచాలన్న ఆలోచనతో స్పీకర్ ఉన్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈనెల 12న రాష్ట్రానికి రావడం, అది 13వ తేదీనే అసెంబ్లీకి, శాసన మండలికి చేరడం తెలిసిందే.
ఆ తరువాత సభ జనవరి 3 వరకు వాయిదా పడటంతో.. స్పీకర్ విభజన బిల్లులపై ఆయా అసెంబ్లీల్లో జరిగిన చర్చల వివరాలను తెలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీలో లోక్‌సభ ప్రస్తుత, వూజీ అధికారులతో కూడా స్పీకర్ భేటీ అయ్యూరు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయున ఇచ్చిన గడువులోగా చర్చను వుుగించాలన్న అభిప్రాయూనికి స్పీకర్ వచ్చారని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నారుు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రత్యేకమైనది కావడం వల్ల విధివిధానాలపై ఆయున ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
డిప్యూటీ స్పీకర్ అసంతృప్తి!
స్పీకర్ వునోహర్ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పర్యటనల్లో తన భాగస్వామ్యం లేకపోవడంపై డిప్యూటీ స్పీకర్ వుల్లు భట్టివిక్రవూర్క అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సవూచారం. ఉపసభాపతిగా ఉన్న తాను కూడ సభానిర్వహణలో పాలుపంచుకోవలసి ఉంటుందని, చర్చల సరళిని తాను కూడా తెలుసుకునేందుకు వీలుగా పర్యటన సమాచారాన్ని తనకు చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయూన్ని ఆయున సన్నిహితుల వద్ద వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈనెల 16వ తేదీన సభలో జరిగిన కొన్ని ఘటనలు ఇరువురి వుధ్య భేదాభిప్రాయూలకు దారితీసినట్లు సమాచారం.
పునర్వ్యవస్థీకరణ బిల్లుపై బీఏసీ పెట్టి అందరితో వూట్లాడాక సభలో చర్చను చేపడతానని స్పీకర్ వునోహర్ అంతకు వుుందు జరిగిన బీఏసీలో సభ్యులకు హామీ ఇచ్చారు. 16వ తేదీన బీఏసీ జరగలేదు. ఆరోజు టీడీపీ సభ్యులు అడ్డుకోవడంతో సభాపతి వునోహర్ సభ లోపలకు వెళ్లలేకపోయూరు. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రవూర్క సభాపతి స్థానంలోకి వెళ్లి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించావుని భట్టి ప్రకటించడం, బీఏసీ పెట్టకుండానే చర్చ ఎలా అంటూ సీఎంతో సహా సీవూంధ్రనేతలు అభ్యంతరం వ్యక్తంచేయుడంతో అది వివాదాస్పదమైంది. ఈ ఘటన స్పీకర్‌ను ఇరకాటంలోకి నెట్టడంతో ఆయున సభ జరిగిన తీరుపై అసంతృప్తికి లోనయ్యూరని చెబుతున్నారు.