'మెట్రో ప్రాజెక్ట్ విజయవాడకే పరిమితం చేయొద్దు' | Metro Rail Project Construction in vgtm region, demands Nadendla Manohar | Sakshi
Sakshi News home page

'మెట్రో ప్రాజెక్ట్ విజయవాడకే పరిమితం చేయొద్దు'

Published Wed, Sep 24 2014 1:31 PM | Last Updated on Sat, Jun 2 2018 6:12 PM

'మెట్రో ప్రాజెక్ట్ విజయవాడకే పరిమితం చేయొద్దు' - Sakshi

'మెట్రో ప్రాజెక్ట్ విజయవాడకే పరిమితం చేయొద్దు'

గుంటూరు: మెట్రో రైలు ప్రాజెక్ట్ విజయవాడ నగరానికే పరిమితం చేయడకూడదని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ మెట్రోరైలు నిర్మిస్తే... ఆ ప్రాజెక్ట్తో మంచి రాజధాని ఏర్పాడుతుందని అన్నారు.

ఓ అధికారి మెట్రో ప్రాజెక్ట్ కేవలం ఓ నగరానికే పరిమితం చేయడం సబబు కాదన్నారు.  రాష్ట్ర పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో 12వ ప్రతిపాదనగా వీజీటీఎం పరిధిలో మెట్రోరైల్ ప్రాజెక్ట్ నిర్మించాల్సి ఉందన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టంలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని మాజీ స్పీకర్ నాదెండ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ రూపశిల్పి శ్రీధరన్... మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్కు విజయవాడనే ఆయన ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement