ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ, అనుసరించిన విధి విధానాలను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల వునోహర్ గురువారం పరిశీలించారు.
యుూపీ విభజనపై అక్కడి స్పీకర్, అధికారులతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల భేటీ
సాక్షి, ైెహ దరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ, అనుసరించిన విధి విధానాలను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల వునోహర్ గురువారం పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ నుంచి విడదీసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సవుయుంలో సంబంధిత బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ ఎలా జరిగిందో అధ్యయునం చేసేందుకు బుధవారం స్పీకర్ నాదెండ్ల వునోహర్, శాసనసభ సచివాలయు అధికారులు లక్నో వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వూతా ప్రసాద్ పాండే, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనసభ అధికారులతో మనోహర్ బృందం సవూవేశమైంది.
యుూపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు దాదాపు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ చర్చ ఒకే ఒక్కరోజులో వుుగిసిందని, చర్చలో 30 మంది సభ్యులు వూత్రమే పాల్గొన్నారని అక్కడి అసెంబ్లీ అధికారులు తెలిపారు. ఆ రికార్డులను స్పీకర్ వునోహర్ పరిశీలించారు. ‘బిల్లుపై చర్చ సందర్భంగా ప్రవుుఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్, ఉద్ధంసింగ్‌నగర్ జిల్లాలను ఉత్తరప్రదేశ్‌లోనే ఉంచాలని ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. భౌగోళికంగా ఆ రెండు జిల్లాలు ఉత్తరాఖండ్‌లోనే ఉన్నందున వాటిని విడదీయురాదని ఆ ప్రాంత ప్రతినిధులు వాదించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు సవరణలు ప్రతిపాదించారు. కేంద్రం వాటిని ఆమోదించలేదు.
అసెంబ్లీలో చర్చకు సవుయుం కేటారుుంపు ఎలా జరిగిందన్న అంశాన్ని కూడా వునోహర్ ఆరా తీశారు. బిల్లుపై ఓటింగ్‌కు అవకాశం ఇచ్చారా? లేదా? అని యుూపీ స్పీకర్‌ను మనోహర్ ప్రశ్నించారు. సభలో అభిప్రాయూలు తెలుసుకొని బిల్లును తిరిగి పంపావుని ఓటింగ్ జరగలేదని అక్కడి స్పీకర్ స్పష్టంచేశారు. అనంతరం వునోహర్, ఏపీ అసెంబ్లీ అధికారులు బీహార్ రాజధాని పాట్నాకు వెళ్లారు. జార్ఖండ్ ఏర్పాటు సందర్భంగా రూపొందించిన బీహార్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు అనుసరించిన విధానాన్ని శుక్రవారం పరిశీలించనున్నారు.