వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు.... స్పీకర్ నాదెండ్ల మనోహర్తో భేటీ కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్....వీరికి అపాయింట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా అసెంబ్లీని తక్షణమే సమావేశపర్చాలని కోరనున్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు స్పీకర్కు విజ్ఞప్తి చేయనున్నారు.