
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం తన సోదరుడు చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు. చాలారోజుల తర్వాత అన్నయ్యతో తమ్ముడి భేటీ జరిగింది. మరోవైపు చిరు, పవన్ కలిసి ఉన్న ఫోటో ట్వీటర్‌లో షేర్ చేయడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కాగా ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ ఓటమిపై ఈ సందర్భంగా పవన్ సమీక్షలు కూడా నిర్వహించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment