
సాక్షి,విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అనుమంచిపల్లిలో పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు నేపద్యంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు పవన్‌ను నందిగామ హైవే మీదుగా విజయవాడ తీసుకెళ్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ని కూడా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ను అడ్డుకోవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో పలువురు కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.