![Minister Gudivada Amarnath Fires on Pawan Kalyan over Modi Tour - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/12/Gudiwada-amarnath.jpg.webp?itok=iac7eUWq)
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అభివృద్ధిలో రాజకీయాలకు ఆస్కారం లేదనే సీఎం జగన్ చెప్పిన మాట చాలా గొప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలో నిర్వహించిన ప్రధాని మోదీ సభ ద్వారా రాష్ట్ర అవసరాలను, రావాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి అడిగే అవకాశం లభించదన్నారు. ఉదయం 9 గంటలకే రెండున్నర లక్షల మందికి పైగా సభకు తరలిరావడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ వ్యాఖ్యలు సంతాప సభలో మాట్లాడినట్లున్నాయని వ్యాఖ్యానించారు. సినిమా నటుడిగా హావభావాలు ప్రదర్శించే పవన్ ఎందుకు పేలవంగా మారారని ప్రశ్నించారు. పవన్‌కు రాజకీయ పొత్తుల్లో టీడీపీనే శాశ్వతం. మిగిలిన పార్టీలన్నీ స్టెపినీలే అంటూ ఎద్దేవా చేశారు.
ప్రధాని సభ విజయవంత కావడంతో దానిని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి చిలక గోరింక రుషికొండకు వెళ్లాయి. జనసేన రాజకీయ పార్టీ కాదు సినిమా పార్టీ అని అన్నారు. నాదెండ్ల మనోహరే పవన్‌ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment