సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాధించిందేంటని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ విసన్నపేట పర్యటన.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఎలుకను కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని చురకలంటించారు. 13 వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ అర్థం లేని విమర్శలు చేశారని పవన్‌పై మండిపడ్డారు.
ఈ మేరకు మంత్రి సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజువాక సభలో పవన్ ఆక్రోశం, విద్వేషం కనిపించిందని విమర్శించారు. రాజకీయంగా పవన్ దిగజారిపోయారని, సీఎం జగన్ పాలనను చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గీతమ్ యూనివర్సిటీ ఆక్రమణలు పవన్‌కు కనిపించలేదా.. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఆక్రమణలపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
సీఎం జగన్, ప్రభుత్వం చేసిన తప్పేంటని అమర్నాథ్ ప్రశ్నించారు. సీఎం జగన్‌పై ఎందుకంత ద్వేషమని నిలదీశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే పవన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టానో చెప్పాలని.. తనలాగా అన్నను అడ్డం పెట్టుకొని రాలేదని పవన్‌కు కౌంటర్ వేశారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. చిరంజీవి తమ్ముడు కాకుంటే పవన్‌ను ఎవరూ చూడరని అన్నారు.
‘పవన్ సినిమాలో హీరో.. సీఎం జగన్ నిజ జీవితంలో హీరో. ఆయన్ను చూసి ఎందుకు అసూయ పడుతున్నాడో అర్థం కావడం లేదు. విస్సనపేటలో ఏమైనా అక్రమాలు జరిగినట్లు నిరుపించవా..? నేను రైతులను ఇబ్బంది పెట్టినట్లు ఒక రైతైనా పిర్యాదు చేశారా?. సమస్యలు మీద అవగాహన ఉండాలంటే కనీసం డిగ్రీ పాస్ అవ్వాలి. చంద్రాబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఇస్సనపేటలో 45 ఎకరాలకు పరిహారం ఇచ్చారు. పోరంబోకు భూములు అయితే ప్రభుత్వం పరిహారం ఇస్తుందా. మీ నాన్న చంద్రబాబుకు చెబితే మేము భయపడతామా పవన్
మీ నాన్న కానిస్టేబుల్ కాక ముందే మా తాత ఎమ్మెల్యే. మీ అన్నయ్య పేరు చెప్పుకొని సినిమాల్లోకి వచ్చావు. మా నాన్న రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. ఆయన చనిపోయిన 18 ఏళ్లు తరవాత సీఎం జగన్ దయవల్ల ఈ స్థాయికి వచ్చాను. చిరంజీవి సినిమా షిటింగ్ చేసినప్పుడు ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఇలానే ఉన్నాయి. ఎర్ర మట్టి దిబ్బలు చూసి పవన్ ఏం చేస్తాడు. మీ నాన్న నీకు ఎందుకు సీఎం పదవి ఇస్తారు. పవన్‌ను కనీసం సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించరని’ మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment