గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనలో పాల్గొంటోంది. బుధవారం సాయుంత్రం వారు ఉత్తరప్రదేశ్ రాజ ధాని లక్నోకు చేరుకున్నారు. యుూపీ స్పీకర్ వూతాప్రసాద్ పాండేతో గురువారం వునోహర్ భేటీ కానున్నారు.