అభిప్రాయం
పవన్ కల్యాణ్ పార్టీ వ్యవ హారం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ పరిశీలిస్తే బహుశా ఇలాంటి పార్టీ భారతదేశంలోనే ఎక్కడా మనకు కనిపించదేమో అని పిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పార్టీని పదేళ్లు నడిపాను అంటూ తరచు మాట్లాడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు అయి ఉండొచ్చు కానీ పట్టుమని చెప్పుకోదగిన స్థాయిలో పది కార్యక్రమాలైనా ఉన్నాయా అంటే చెప్ప డానికి ఆ పార్టీ కార్యకర్తలే తడబడతారు. ఎందుకంటే పదేళ్లు పూర్తిగా నడిపింది పార్ట్ టైం పాలిటిక్స్. పార్ట్ టైం ఉద్యోగాల గురించి విన్నాంగానీ పార్ట్ టైం రాజకీయాలను పరిచ యం చేసింది మాత్రం పవన్ అనే చెప్పాలి. పోనీ ఆ పార్ట్ టైం కార్య కలాపాలైనా ఆయన నిర్వహించారా అంటే అదీ లేదు. తను జస్ట్ గెస్ట్ ఫాకల్టీ మాత్రమే!
సినిమాల్లో ఒక మాస్ హీరోలా ఎలా నటి స్తారో... అదే సంస్కృతి (ప్రక్రియ)ని రాజకీయల్లో కూడా చొప్పించి తన ఘనత చాటుకున్నారు. సినిమాలో హీరో చేసే ఫైట్లు, ఫీట్లూ అన్నీ డూప్. పాడే పాటలూ ఆయన పాడరు. కానీ ప్రేక్షకులకు హీరోనే ఇవన్నీ చేస్తాడని అనిపిస్తుంది. ఇదే ఫార్ములా రాజకీయాలకి అప్లై చేశారు పవన్ కల్యాణ్.
పార్టీని ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యత నాదెండ్ల మనోహర్‌కి అప్పజెప్పారు. ప్రెస్ మీట్‌లో ఏదైనా మాట్లాడాలన్నా, విలేకరులు అడిగిన ప్రశ్న లకు జవాబు చెప్పాలన్నా నాదెండ్ల మనోహర్ ఇన్‌పుట్స్ ఇస్తే తప్ప జవాబు చెప్పలేని పరిస్థితి. ఉపన్యాసాలు ఇవ్వాలంటే ఎవరో రాసిచ్చిన ఉప న్యాసాలకు హావభావాలు జోడించడం మాత్రమే పవన్ చేసే పని.
ఫైనల్‌గా సినిమాను డిస్ట్రిబ్యూటర్‌కు అమ్మే సినట్టు పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. పార్టీ కార్యకర్తల చేతుల్లో తెలుగుదేశం జెండాలు పెట్టారు. చెప్పులేసుకుని తిరిగే వాళ్ళను చట్ట సభలకు పంపిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో చివరగా చిప్ప పెట్టి కోటీశ్వరులకు టిక్కెట్లు ఇచ్చేసు కున్నారు. పైగా తన పార్టీలో ఎవరెవరు నించో వాలి అనే నిర్ణయాధికారాన్ని కూడా చంద్రబాబుకే అప్ప జెప్పే శారు. అచ్చంగా డిస్ట్రిబ్యూటర్ ఏ ఏ థియేటర్స్‌కు సినిమా రిలీజ్ చేయాలో నిర్ణయించినట్టు!
సాక్షాత్తు తను పిఠాపురంలో పోటీ చేసే చోట పట్టుమని నాలుగు రోజులు తిరిగే ఓపిక కూడా లేక ఆ బాధ్యతనూ వర్మ చేతిలో పెట్టేశారు. వాలంటీర్లను నోటికొచ్చినట్టు తిట్టి, అవ్వ తాతల్ని మండుటెండలో అష్ట కష్టాలు పెడుతూ తను మాత్రం గంట కూడా ఎండలో తిరగలేక స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ఈ విచిత్ర విన్యా సాలు, విపరీత పోకడలకు జన సైనికులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీర మహిళ లైతే ఒక అడుగు ముందుకు వేసి, ‘‘మాటలు కోటలు దాటిస్తున్నాడు. మానాభిమానాల్ని మాత్రం ‘కోట’లో దాచి పెడు తున్నాడు’’ అంటూ నర్మగర్భంగా టీవీ చర్చల్లోనే వ్యాఖ్యా నించటం గమనార్హం!
పి. విజయబాబు
వ్యాసకర్త పూర్వ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment