సభలో బిల్లు | Telangana Bill introduced in Andhra Pradesh Assembly | Sakshi
Sakshi News home page

సభలో బిల్లు

Published Tue, Dec 17 2013 1:43 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

సభలో  బిల్లు - Sakshi

సభలో బిల్లు

  • గందరగోళం మధ్యే సభ ముందుకు బిల్లు
  •  స్పీకర్ అనుమతితో ప్రవేశపెట్టిన కార్యదర్శి
  •   బిల్లును చర్చకు చేపట్టాల్సిందిగా కోరిన శ్రీధర్‌బాబు
  •   చర్చ మొదలెట్టాలంటూ బాబును ఆహ్వానించిన మల్లు
  •   నిరసనలు మిన్నంటడంతో అసెంబ్లీ నేటికి వాయిదా
  •   చర్చ మొదలైందా, లేదా అన్నదానిపై సందిగ్ధం
  •   మొదలైందన్న సభా మంత్రి, డిప్యూటీ స్పీకర్
  •   కాలేదంటున్న సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు
  •   పార్టీలకతీతంగా చెరోవైపు మోహరించిన ఎమ్మెల్యేలు
  •   బిల్లు చించేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. 
  •   వారిపై దాడికి యత్నం.. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల హోరు
  •   సభ లోపల, వెలుపల, మీడియా పాయింట్ వద్దా ఘర్షణ
  •   స్పీకర్‌ను చాంబర్‌లో దిగ్బంధించిన సీమాంధ్ర సభ్యులు
  •   సభలో డిప్యూటీపైకి బిల్లు ప్రతులు విసిరేసిన వైనం
  •  
     ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లును శాసనసభ్యుల తీవ్ర నిరసనల మధ్య సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉదయం సభ సమావేశమైనప్పటి నుంచి సాయంత్రం వాయిదా పడేదాకా ప్రాంతాలవారీగా సభ్యుల మధ్య ఆద్యంతం తీవ్ర గందర గోళం, అంతకుమించిన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతటి కీలక సమయంలో సభా నాయకుడైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ముగ్గురూ సభకు గైర్హాజరు కావడం విస్మయం కలిగించింది. మరోవైపు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర సభ్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా విభజన బిల్లుపై ముందుకెళ్లడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. సభ్యుల తీవ్ర గందరగోళం మధ్యే బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ ముందుంచారు. 
     
     దానిపై సభలో చర్చ మొదలైందని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బిల్లుపై చర్చ చేపట్టారు. దానిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా విపక్ష నేత బాబును మల్లు ఆహ్వానించారు. కానీ బాబు స్పందించకపోవడం, సభ్యుల నిరసనలు, గందరగోళం మిన్నంటుతుండటంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. బిల్లుపై చర్చ మొదలైందని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, అదేమీ లేదని, దాన్ని తాము గుర్తించడం లేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎవరి వాదన వారు విన్పించారు. సభా వ్యవహారాల సలహా సంఘాన్ని (బీఏసీ) సమావేశపరిచి చర్చకు తేదీని నిర్ణయించాలని సీమాంధ్ర సభ్యులు డిమాండ్ చేశారు.
     
      మరోవైపు సోమవారం రాత్రి కిరణ్‌తో సమావేశమైన అనంతరం సీమాంధ్ర ప్రాంత మంత్రులు కూడా బిల్లుపై సభలో చర్చ మొదలు కానే లేదని ప్రకటించారు. దాంతో అసలు బిల్లుపై చర్చ మొదలైనట్టా, లేదా అన్న విషయంలో తీవ్ర సందిగ్ధం, అయోమయం నెలకొన్నాయి. ఇంకోవైపు సభ వాయిదా పడ్డాక కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీమాంధ్రకు చెందిన టీడీపీ సభ్యులు అర్ధరాత్రి దాకా సభలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, సోమవారం ఈ మొత్తం ఎడిసోడ్‌లో టీడీపీ ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి ఒక్కటే మరో ఎత్తుగా నిలిచింది. రోజంతా టీడీపీకి చెందిన తెలంగాణ సభ్యులతో ఒకలా, సీమాంధ్ర సభ్యులతో మరోలా చంద్రబాబు వ్యవహరిస్తూ తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి ప్రదర్శించారు.
     
     
     సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు సోవువారం శాసనసభను తీవ్రంగా కుదిపేసింది. సభ లోపల, వెలుపల పరిస్థితి అచ్చం రణరంగాన్నే తలపించింది. ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా, ప్రాంతాలవారీగా చెరోవైపు మోహరించారు. అసెంబ్లీ లోపలా, బయుటా వారి మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం గంటల తరబడి కొనసాగింది. సభ లోపలే గాక మీడియూ పారుుంట్ వద్ద కూడా సభ్యుల నడువు తోపులాట, వాగ్వాదాలు చోటుచేసుకున్నారుు. ప్రాంతాల వారీగా చీలిపోరుున ప్రజాప్రతినిధులు ఒక దశలో కొట్లాడుకుంటారేమో అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఉదయుం తొమ్మిది గంటలకు సభ ఆరంభం కాగానే మొదలైన నిరసనలు, బైఠారుుంపులు రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగారుు. 
     
     బిల్లుపై చర్చ జరగకుండా చూడాలని సీవూంధ్ర సభ్యులు, ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ మొదలయ్యేలా చేయుటానికి తెలంగాణ సభ్యులు ఎత్తుగడలకు పదును పెట్టారు. సభ ప్రారంభం కాగానే రోజులాగే సీవూంధ్ర సభ్యులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేయుడం మొదలు పెట్టారు. తమ వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టగా వాటిని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆ వెంటనే, బిల్లుపై తక్షణం చర్చ ప్రారంభించాలంటూ తెలంగాణ సభ్యులు సభను హోరెత్తించారు. కార్యక్రవూలు జరిగే పరిస్థితి లేకపోవడంతో సభను స్పీకర్ వారుుదా వేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ ఆరేపల్లి మోహన్ నాదెండ్లతో సమావేశమయ్యారు. వెంటనే బీఏసీ నిర్వహించి బిల్లుపై చర్చ ఆరంభించాలని డిమాండ్ చేశారు.
     
     మొదలవుతూనే గందరగోళం
     ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. ఈసారి సభలో పోడియుం వైపు సీవూంధ్ర సభ్యులు దూసుకురాకుండా ఉండేందుకా అన్నట్టుగా తెలంగాణ సభ్యులు స్పీకర్ చుట్టూ నిలబడ్డారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై సభ అభిప్రాయుం కోరుతూ రాష్ట్రపతి పంపిన లేఖను స్పీకర్ చదివారు. బిల్లును సభ వుుందుంచుతున్నట్టు ప్రకటించారు. బిల్లు తాలూకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ ప్రతులు సభ కౌంటర్ వద్ద ఉన్నాయని సభ్యులకు సూచించారు. అనంతరం స్పీకర్ ఆదేశం మేరకు బిల్లులోని ప్రధానాంశాలను అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం సభలో చదివి వినిపించారు. ఇదంతా జరుగుతున్నంతసేపూ సభ్యులంతా ఆందోళన చేస్తూనే ఉన్నా రు. బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన నినాదాలతో సీవూంధ్ర సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లారు. ఈలోపు స్పీకర్ ప్రకటన, అసెంబ్లీ కార్యదర్శి సంక్షిప్త ప్రస్తావన వుుగిశాయి. బిల్లు ప్రతులను సభ్యులకు అందుబాటులో ఉంచుతున్నావునీ, సాధారణంగా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు పాటించాల్సిన నిబంధనలు దీనికి వర్తించబోవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈలోపు గొడవ వురీ పెరిగిపోరుు సభ్యులు ప్లకార్డులను చించేదాకా వెళ్లడంతో సభ వారుుదా పడింది.
     
     రణరంగంగా మీడియా పాయింట్
     బిల్లును సభ వుుందుంచుతున్న విషయూన్ని వుుందే ఎలా లీక్ చేశారంటూ టీడీపీ సభ్యులు స్పీకర్‌ను ఆయన చాంబర్ లో ప్రశ్నించారు. సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తరవాత సభ వ్యవహారాలపై మంత్రులు ఆనం, రఘువీరా, పితాని, పార్థసారథి తదితరులు స్పీకర్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు సభ బయుట పరిస్థితి వురింతగా దిగజారింది. మీడియూ పారుుంట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిల్లు ప్రతుల్ని చింపేసి దహనం చేసి తవు నిరసన వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ గండ్ర, టీఆర్‌ఎస్ సభ్యుడు గంగుల కవులాకర్ ఒక దశలో వైఎస్సార్‌సీపీ సభ్యులపై దౌర్జన్యానికి పూనుకున్నారు. అంతలో టీడీపీ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని బిల్లు ప్రతుల్ని చింపేశారు. టీఆర్‌ఎస్, తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో రెండు పక్షాల నడువు వాగ్వాదాలు, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. వురోవైపు శాసనవుండలిలోనూ సభ్యులు ఇలాగే ప్రాంతాలవారీగా చీలిపోరుు వాగ్వాదాలకు దిగారు. అక్కడ కూడా మీడియూ భేటీలో టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యుల నడువు తోపులాట జరిగింది. దాంతో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకువూరి కిందపడిపోయూరు.
     
     జర్నలిస్టులు సైతం...
     అసెంబ్లీ మీడియూ పారుుంట్ వద్ద కొన్ని చానళ్లు, పత్రికల జర్నలిస్టులు సైతం నాయుకులతో వాగ్వాదాలకు దిగారు. కొందరు టీవీ జర్నలిస్టులు దాడి చేశారని, వారిపై చర్య తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, గుర్నాథరెడ్డి, తెల్లం బాలరాజు, రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
     
     స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు
     దాదాపు ఐదు గంటల విరామం తర్వాత చివరికి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు స్పీకర్ కార్యాలయుంలో బైఠారుుంచి, నాదెండ్లను సభలోకి వెళ్లనీయకుండా దిగ్బంధించారు. దాంతో సభలోకి వెళ్లాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ మల్లుకు ఆయన సూచించారు. ఆ మేరకు సభలోకి వెళ్లబోయిన మల్లును టీడీపీ ఎమ్మెల్యే రామారావు అడ్డుకున్నారు. ఆయనను మల్లు తోసేశారు. అడ్డుకోబోయిన మిగతా సభ్యులను మార్షల్స్ పక్కకు తప్పించి మల్లును సభలో స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లారు. సభ ప్రారంభవుయ్యూక వుళ్లీ అవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. సీవూంధ్ర ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. బిల్లు ప్రతులు చించి పోడియుం వైపు వెదజల్లారు. మల్లుపైకీ విసిరేశారు. పోడియం టేబుల్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. స్పీకర్ స్థానం ముందున్న మైకులను లాగేశారు. 
     
     జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు కూడా ప్లకార్డులతో పోడియాన్ని చుట్టుముట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పెకైక్కి నినాదాలు మొదలుపెట్టారు. శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి సహా మరికొందరు వైఎస్సార్‌సీపీ సభ్యులు బిల్లు ప్రతులను చించి స్పీకర్ స్థానంలో ఉన్న మల్లుపైకి విసరసాగారు. కాంగ్రెస్ సభ్యుడు మధుసూదన్ గుప్తా స్పీకర్ పోడియం టేబుల్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయనను పక్కకు తోసేశారు. స్పీకర్ ముందున్న మైకులను లాగేసిన కాపును టీఆర్‌ఎస్ సభ్యులు పక్కకు తోసేశారు. దాంతో ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్లకార్డులను, బిల్లు ప్రతులను చించి మల్లుపైకి విసిరారు. అదే సమయంలో సభలోకి ప్రవేశించిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో స్పీకర్ స్థానంపైకి ప్లకార్డులు విసిరారు. దాంతో తెలంగాణ, సీమాంధ్ర సభ్యుల మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గంగుల కమలాకర్ అసెంబ్లీ సిబ్బంది బల్లలపై నుంచి సీమాంధ్ర ఎమ్మెల్యేల మధ్యలోకి వెళ్లి వారిని తోసేశారు.
     
     కేంద్రానికి కృతజ్ఞతలు: శ్రీధర్‌బాబు
     ఈ దశలోనే సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయుం తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మన్మోహన్, సోనియాకు, రాహుల్‌గాంధీకి, కేంద్ర మంత్రుల బృందానికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలూ అంగీకరించాయి. ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చాక బీఏసీని పిలవాలని, బిల్లును సభలో ప్రవేశపెట్టాలని కోరుతూనే ఉన్నాం. ఇప్పుడు బిల్లును సభ ముందుంచి, దాన్ని చర్చకు చేపట్టే సమయంలో సభ్యులు ఇలా స్పీకర్‌ను అడ్డుకోవడం, గలభా సృష్టించడం విచారకరం. తెలంగాణ ఏర్పాటు కోసం 60 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. బిల్లును తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, సభ్యుల అభిప్రాయాలు తెలియజేయడానికి బిల్లుపై చర్చ ప్రారంభించాలని మల్లును కోరారు. ఆయన అందుకు సమ్మతించి, చర్చ ప్రారంభించాలని విపక్ష నేత బాబును ఆహ్వానించారు. కానీ బాబు తన స్థానం నుంచి లేవకపోవడం, సభ్యుల నిరసనలతో గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొనడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ, సీమాంధ్రకు చెందిన టీడీపీ సభ్యులు సోమవారం అర్ధరాత్రి వరకూ అసెంబ్లీలోనే బైఠాయించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement