గుంతకల్లు రూరల్: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో కేసు నమోదు అయినట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా గుంతకల్లులో వివరాలు వెల్లడించారు.
విశాఖ ఘటన ద్వారా రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ స్పందించి
తమ ఫిర్యాదును విచారణకు స్వీకరించిందని తెలిపారు.
పవన్ కల్యాణ్‌పై మానవహక్కుల కమిషన్‌లో కేసు
Published Wed, Oct 19 2022 4:56 AM | Last Updated on Wed, Oct 19 2022 9:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment