రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్తో శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ కేంద్రం తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకుంటే... అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిపే దిశగా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో పార్టీల బలబలాలు, ప్రస్తుత పరిస్థితులపై దిగ్విజయ్ ఆరాతీసినట్టు సమాచారం.