ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏపీ భవన్ కు చేరుకున్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ఏపీ భవన్ కు చేరుకున్నారు.శాసనసభను జనవరి 3 వ తేదీ వరకూ వాయిదా వేసిన స్పీకర్.. గతంలో జరిగిన విభజన ప్రక్రియ విధి విధానాలను తెల్సుకోనేందుకు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వెళ్లారు.