సవరణలపై మాత్రమే ఓటింగ్ | the only voting on manipulation | Sakshi
Sakshi News home page

సవరణలపై మాత్రమే ఓటింగ్

Published Tue, Jan 7 2014 1:50 AM | Last Updated on Sat, Aug 25 2018 5:25 PM

the only voting on manipulation

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో ఓటింగ్‌కు అవకాశం లేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బిల్లుపై ఓటి ంగ్ జరగలేదని తెలిపారు.

 ఇతర రాష్ట్రాల విభజన పద్ధతులపై బీఏసీకి స్పీకర్ నోట్  
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో ఓటింగ్‌కు అవకాశం లేదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బిల్లుపై ఓటి ంగ్ జరగలేదని తెలిపారు. అయితే సవరణలపై ఓటింగ్ జరపవచ్చన్నారు. సోమవారం బీఏసీ సమావేశంలో విభజన బిల్లుపై యూపీ, బీహార్ శాసనసభల్లో అనురించిన విధానాలపై సభ్యులకు అందజేసిన నోట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. నోట్‌లోని ముఖ్యాంశాలు...
 
  యుూపీ విభజన బిల్లులో సవరణలకు అవకాశమివ్వగా ప్రభుత్వపక్షం 29, ప్రతిపక్షం 4 సవరణలను ప్రతిపాదించాయి. వీటిపై తవు అభిప్రాయూలు చెప్పేందుకు సభ్యులకు అవకాశమిచ్చారు. వుూజువాణి ఓటును నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను సభ ఆమోదించగా ప్రతిపక్షం సవరణలను తిరస్కరించింది. ఈ సవరణలతో కలిపి బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపారు. బిల్లుపై ఒక్కరోజే చర్చ జరగ్గా 30 వుంది పాల్గొన్నారు.
 
  బీహార్‌లో విభజన బిల్లుపై ఓటింగ్ కోరుతూ కొందరు సభ్యులు ఒక తీర్మానం ప్రతిపాదించగా మూజువాణి ఓటుతో స్పీకర్ తిరస్కరించారు. అయితే బిల్లుపై అభిప్రాయూలు తీసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర వుుఖ్యవుంత్రే స్వయుంగా స్పీకర్‌కు నోటీసు అందించారు. ఆ రాష్ట్ర బీఏసీ నిర్ణయుం మేరకు చర్చను రెండు విభాగాలుగా చేపట్టారు. బిల్లుపై సాధారణ చర్చ ఒకటికాగా, అంశాల (క్లాజస్) వారీ చర్చ రెండోది. క్లాజ్‌లకు సవరణలను స్వీకరించడమే కాకుండా వాటిని అసెంబ్లీ ప్రోసీడింగ్స్‌లో ఒక ప్రత్యేక భాగంగా చేర్చారు.
 
 బీఏసీలో ఆరుగంటల సవుయుమే అనుకున్నా చర్చ 10 గంటల సేపు సాగి 42 వుంది పాల్గొన్నారు. మొత్తం 371 సవరణలను సభ్యులు ప్రతిపాదించగా, వాటిపై సభ్యుల అభిప్రాయూలు తీసుకున్నారు. సవరణలపైనా వుూజువాణి ఓటింగ్ నిర్వహించగా కొన్ని ఆమోదం, కొన్ని తిరస్కరణకు గురయ్యూరుు.
 
  బీహార్‌కు *1.79 లక్షల కోట్ల కేంద్ర గ్రాంట్ ఇవ్వాలన ్న సవరణను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరణలపై చర్చరూపంలో సభ్యులు అభిప్రాయుం చెప్పడమే తప్ప లిఖితపూర్వక అభిప్రాయూలు ఎవరూ ఇవ్వలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement