అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది అధికార పక్షం. సంతాప తీర్మానాల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. సోమవారం ఉదయం తొమ్మిదిన్నరకు సభ ప్రారంభమైన వెంటనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత గోదావరి పుష్కర మృతులపై అసెంబ్లీ తీర్మానం చేసింది.