న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ఆయన రెండోసారిఅ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అమెరికన్ ఓటర్లు.. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది.
ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి.. డొనాల్డ్ ట్రంప్, రన్నింగ్‌మేట్( ఉపాధ్యక్షుడు) జేడీ వాన్స్‌కి అభినందనలు తెలిపారు.‘‘ మేం అమెరికాను రక్షించాం. రిపబ్లిక్ పార్టీ ఘన విజయంతో..యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా సెనేటర్ జేడీ వాన్స్ వైట్ హౌస్‌కు వెళ్తున్నారు. వారితో కలిసి అమెరికన్ ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.
We have saved America. 🇺🇸
The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House.
We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024
చదవండి: రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
Comments
Please login to add a commentAdd a comment