ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కన్నాపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు.. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అవినీతి పాల్పడుతున్నాడనీ, మాఫియా నుండి భూ తగాదాల వరకు సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అక్రమాల చిట్టా మొత్తం తన వద్ద ఉందన్న ఆయన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని చూసైనా ముడియం శ్రీనివాస్ నేర్చుకోవాలని హితవు పలికారు.
నియోజకవర్గంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేను అవినీతిపరునిగా చిత్రీకరించడం పట్ల ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ వ్యాఖ్యలతో జనచైతన్య యాత్ర మధ్యలోనే వెల్లిపోయారు. మాగంటి బాబు వ్యవహారశైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి ముడియం శ్రీనివాస్ సమాయత్తం అవువున్నారు.