chintamaneni
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలపై మండిపడ్డ YSRCP నేతలు
-
దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
-
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
చంద్రబాబు ఆశీస్సులతో రెచ్చిపోయిన చింతమనేని
-
కృష్ణారావును పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు
-
చింతమనేనితో నాకు ప్రాణహాని ఉంది
-
చింతమనేనిపై సొంత పార్టీ నేతల అరోపణలు
-
చింతమనేని బహిరంగ క్షమపణ చెప్పాలి
ఏలూరు(సెంట్రల్)ః అభివృద్ధి పనులు చేసి ప్రజలను ఆకట్టుకోలేక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిళ్ళంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక పవరుపేటలోని ఐద్వా కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా చింతమనేని వ్యవహరిస్తున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులను తిట్టడమే కాకుండా మీడియా ప్రతినిధులపై దాడి చేసి మీడియా స్వేచ్చను హరిస్తున్నారన్నారు. ప్రభాకర్‌కు మహిళల పట్ల చాలా చులకనగా వ్యవహరిస్తున్నారని, అన్ని తెలిసిన చంద్రబాబు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతడికి పూర్తి సహకారిస్తున్నరన్నారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్న చంద్రబాబు తన పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బహిరంగంగా మహిళలను దుర్భాషలాడుతున్న ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని ఆమె అన్నారు. మధ్యాహ్నభోజన కార్మికులకు మీడియా ప్రతినిధికి చింతమనేని ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం కలగచేసుకోవాలని, అసలే అతను రౌడీషీటర్ కావడం విప్ పదవిప కట్టపెట్టడం వల్ల ఆయన ఆగడాలు మరింత ఎక్కువయ్యాయన్నారు. విప్ పదవి నుండి తొలగించాలని యూవీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.రాజారామ్మోహనరాయ్, కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, వివిధ సంఘాల నాయకులు పీ.కిషోర్, ఎల్వీ. సుధాకర్, రాంబాబు, శ్యామలారాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చింతమనేని వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టుల ధర్నా
ఏలూరు (ఆర్ఆర్ పేట) : టీవీ జర్నలిస్టుపై దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వ విప్, చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులో జర్నలిస్టులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పౌర సంబంధాధికారి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేన్ వద్దకు చేరుకుంది. పోలీస్‌స్టేన్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు యూనియన్ నాయకులు కె.మాణిక్యరావు, జి.రఘురాం, జీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోందో, నిరంకుశపాలన నడుస్తోందో అర్థం కాకుండా ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా అహర్నిశలూ కష్టపడి పనిచేసే జర్నలిస్టులపై సాక్షాత్తూ ప్రభుత్వ ప్రతినిధులే దాడి చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని ప్రశ్నించారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు తగిన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పి.రవీంద్రనాథ్, పలువురు ప్రింట్ మీడియా, ఎలక్టాన్రిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
చింతమనేని అరెస్ట్‌కు డిమాండ్
కొవ్వూరు : విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయునిపై దాడికి తెగబడిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో బి.శ్రీనివాసరావుకు అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే కోశాధికారి, కొవ్వూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గంధం పూజ్య నరసింహ బాపూజీ, ఉపాధ్యక్షులు జీవీవీ సత్యనారాయణ, జి.శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పుప్పాల సురేష్, కొవ్వూరు ప్రెస్‌క్లబ్ కార్యదర్శి కె.దాసు, సంయుక్త కార్యదర్శి నల్లా స్వామినాయుడు, కోశాధికారి ఎ.ప్రకాష్, పాత్రికేయులు తోట అవినాష్, మానేపల్లి సాయిరామకృష్ణ, జి.రవికుమార్, ఎ¯ŒS.రామం, మురమళ్ల వీవీ రామారావు, గొర్రెల ఎర్రన్న, ఎన్.వెంకటేశ్వరరావు, గరగ ప్రసాద్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం రూరల్ : ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల దాడికి నిరసనగా తాడేపల్లిగూడెం పాత్రికేయులు గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి చింతమనేని, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ పాశం నాగమణికి అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి యడ్లపల్లి శ్రీను, ఐజేయూ సభ్యుడు వానపల్లి సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు అలమండ వెంకట నరసింహారావు, వై.సోమరాజు, పాత్రికేయులు చిక్కాల రామకృష్ణ, ఆకుల ప్రసాద్, బండి రామస్వామి, తోట ధరణిబాబు, రామకృష్ణ, కళ్యాణ్, చింతకాయల దొరబాబు, బుజ్జిబాబు పాల్గొన్నారు. -
ప్రభాకర్ అరెస్ట్‌కు డిమాండ్
భీమవరం టౌన్: మధ్యాహ్న భోజన వర్కర్లపై దౌర్జన్యానికి పాల్పడటంతోపాటు విలేకరిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహనరాయ్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఆ సంఘ డివిజన్ కమిటీ సమావేశం బి.సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. రామ్మోహనరాయ్ మాట్లాడుతూ చింతమనేని గతంలో మహిళా తహసీల్దార్‌పై దాడి చేశారని, ఆ తరువాత అంగన్వాడీ వర్కర్లను దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగారని, ఇప్పుడు ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లపై దౌర్జన్యం చేశారని వివరించారు. ఇటువంటి ఎమ్మెల్యేను పదవి నుంచి ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి బి.వాసుదేవరావు, బీవీ వర్మ, బి.ఆంజనేయులు, ఐ.సాయిబాబు పాల్గొన్నారు. -
చింతమనేని చిందులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెలే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దౌర్జన్యం.. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖ అధికారిపై దాడి.. ఐసీడీఎస్ అధికారులకు బెదిరింపులు.. ఏలూరు టూటౌన్‌పోలీస్ స్టేషన్‌పై దాడికెళ్లినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోవడం.. అంగన్వాడీ కార్యకర్తలను దుర్భాషలాడటం.. పోలీస్ కానిస్టేబుల్‌ను చితక్కొట్టడం.. అటవీ శాఖ అధికారిని బలవంతంగా సెలవుపై పంపించడం.. ఇటీవల కొల్లేరు వివాదాస్పద భూముల్లో చేపలు పట్టే విషయంలో జిల్లా ఎస్పీపై నోరుపారేసుకోవడం వంటి ఘటనలతో బెంబేలెత్తించిన చింతమనేని.. బుధవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై విరుచుకుపడ్డారు. ఓ చానల్ విలేకరిపైనా దాడికి దిగారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. వారిపై విరుచుకుపడ్డారు. జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు కారులో వెళుతున్న చింతమనేని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నాలో తన నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండటాని చూసి ధర్నా శిబిరం వద్ద ఆగారు. ఇక్కడకి ఎందుకు వచ్చారంటూ వారిపై విరుచుకుపడ్డారు. బూతు పురాణం విప్పి ‘మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తా’నంటూ దుర్భాషలాడారు. అక్కడే ఉన్న 99 చానల్ విలేకరి, ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కడవకొల్లు సాగర్ ఈ తతంగాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండటంతో చింతమనేని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు విలేకరి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను లాక్కుని అతనిపై దౌర్జన్యానికి తెగబడి ఈడ్చుకెళ్లిపోరు. పోలీసులు ఆ విలేకరిని కాపాడి పక్కకు తీసుకువెళ్లారు. గతంలోనూ చింతమనేని మీడియా విషయంలో ఇదే విధంగా వ్యవహరించారు. తన కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీస్తున్న వారినుంచి కెమెరాలు లాక్కోవడం పరిపాటిగా మారింది. బుధవారం నాటి ఘటనతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. సుమారు 2 గంటలపాటు రాస్తారోకో కొనసాగడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అనంతరం చింతమనేనిపై చర్యలు కోరుతూ ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్ రామకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. డీఐజీ స్పందిస్తూ.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను ఆదేశించారు. రాస్తారోకోలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శి జి.రఘురామ్, సంయుక్త కార్యదర్శి ఎస్కే రియాజుద్దీన్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కాగిత మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి పి.రవీంద్రనాథ్ పలువురు పాత్రికేయులు, ఫొటో జర్నలిస్ట్‌లు, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు ‘అతడిని పదవికి అనర్హుడిగా ప్రకటించాలి’ ఏలూరు (ఆర్ఆర్ పేట) : బాధ్యతాయుతమైన ప్రభుత్వ విప్ హోదాలో ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్న చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళల సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి వారిపైనే చింతమనేని దౌర్జన్యానికి దిగడం దుర్మార్గమన్నారు. మీడియా ప్రతినిధులపైనా ఆయన దాడులకు తెగబడటాన్ని చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తోందా, నియంతృత్వ పాలన సాగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి చింతమనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చింతమనేని పై పోలీసులకు ఫిర్యాదు
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై అంగన్ వాడీల నిరసనలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం నిరసనకు దిగిన అంగన్ వాడీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై అంగన్ వాడీలు మండి పడుతున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో చింతమనేనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా అంగన్వాడి కార్యకర్తలసంఘం సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కన్నాపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు.. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అవినీతి పాల్పడుతున్నాడనీ, మాఫియా నుండి భూ తగాదాల వరకు సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అక్రమాల చిట్టా మొత్తం తన వద్ద ఉందన్న ఆయన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని చూసైనా ముడియం శ్రీనివాస్ నేర్చుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేను అవినీతిపరునిగా చిత్రీకరించడం పట్ల ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ వ్యాఖ్యలతో జనచైతన్య యాత్ర మధ్యలోనే వెల్లిపోయారు. మాగంటి బాబు వ్యవహారశైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి ముడియం శ్రీనివాస్ సమాయత్తం అవువున్నారు. -
చింతమనేని క్రైం చిట్టా
-
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని