టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై అంగన్ వాడీల నిరసనలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం నిరసనకు దిగిన అంగన్ వాడీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై అంగన్ వాడీలు మండి పడుతున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో చింతమనేనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా అంగన్‌వాడి కార్యకర్తలసంఘం సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.