ప్రభాకర్ అరెస్ట్‌కు డిమాండ్
Published Thu, Dec 22 2016 2:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
భీమవరం టౌన్: మధ్యాహ్న భోజన వర్కర్లపై దౌర్జన్యానికి పాల్పడటంతోపాటు విలేకరిపై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.రాజారామ్మోహనరాయ్ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఆ సంఘ డివిజన్ కమిటీ సమావేశం బి.సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. రామ్మోహనరాయ్ మాట్లాడుతూ చింతమనేని గతంలో మహిళా తహసీల్దార్‌పై దాడి చేశారని, ఆ తరువాత అంగన్‌వాడీ వర్కర్లను దుర్భాషలాడి దౌర్జన్యానికి దిగారని, ఇప్పుడు ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్లపై దౌర్జన్యం చేశారని వివరించారు. ఇటువంటి ఎమ్మెల్యేను పదవి నుంచి ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి బి.వాసుదేవరావు, బీవీ వర్మ, బి.ఆంజనేయులు, ఐ.సాయిబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement