చింతమనేని అరెస్ట్‌కు డిమాండ్
Published Fri, Dec 23 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
కొవ్వూరు : విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయునిపై దాడికి తెగబడిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో బి.శ్రీనివాసరావుకు అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే కోశాధికారి, కొవ్వూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గంధం పూజ్య నరసింహ బాపూజీ, ఉపాధ్యక్షులు జీవీవీ సత్యనారాయణ, జి.శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పుప్పాల సురేష్, కొవ్వూరు ప్రెస్‌క్లబ్ కార్యదర్శి కె.దాసు, సంయుక్త కార్యదర్శి నల్లా స్వామినాయుడు, కోశాధికారి ఎ.ప్రకాష్, పాత్రికేయులు తోట అవినాష్, మానేపల్లి సాయిరామకృష్ణ, జి.రవికుమార్, ఎ¯ŒS.రామం, మురమళ్ల వీవీ రామారావు, గొర్రెల ఎర్రన్న, ఎన్.వెంకటేశ్వరరావు, గరగ ప్రసాద్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం రూరల్ : ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల దాడికి నిరసనగా తాడేపల్లిగూడెం పాత్రికేయులు గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి చింతమనేని, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ పాశం నాగమణికి అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి యడ్లపల్లి శ్రీను, ఐజేయూ సభ్యుడు వానపల్లి సుబ్బారావు, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ సభ్యులు అలమండ వెంకట నరసింహారావు, వై.సోమరాజు, పాత్రికేయులు చిక్కాల రామకృష్ణ, ఆకుల ప్రసాద్, బండి రామస్వామి, తోట ధరణిబాబు, రామకృష్ణ, కళ్యాణ్, చింతకాయల దొరబాబు, బుజ్జిబాబు పాల్గొన్నారు.
Advertisement
Advertisement