చింతమనేని బహిరంగ క్షమపణ చెప్పాలి
ఏలూరు(సెంట్రల్)ః
అభివృద్ధి పనులు చేసి ప్రజలను ఆకట్టుకోలేక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు దారుణంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిళ్ళంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక పవరుపేటలోని ఐద్వా కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా చింతమనేని వ్యవహరిస్తున్నారని, మధ్యాహ్న భోజన కార్మికులను తిట్టడమే కాకుండా మీడియా ప్రతినిధులపై దాడి చేసి మీడియా స్వేచ్చను హరిస్తున్నారన్నారు. ప్రభాకర్‌కు మహిళల పట్ల చాలా చులకనగా వ్యవహరిస్తున్నారని, అన్ని తెలిసిన చంద్రబాబు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతడికి పూర్తి సహకారిస్తున్నరన్నారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్న చంద్రబాబు తన పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బహిరంగంగా మహిళలను దుర్భాషలాడుతున్న ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హమని ఆమె అన్నారు. మధ్యాహ్నభోజన కార్మికులకు మీడియా ప్రతినిధికి చింతమనేని ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం కలగచేసుకోవాలని, అసలే అతను రౌడీషీటర్ కావడం విప్ పదవిప కట్టపెట్టడం వల్ల ఆయన ఆగడాలు మరింత ఎక్కువయ్యాయన్నారు. విప్ పదవి నుండి తొలగించాలని యూవీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.రాజారామ్మోహనరాయ్, కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, వివిధ సంఘాల నాయకులు పీ.కిషోర్, ఎల్‌వీ. సుధాకర్, రాంబాబు, శ్యామలారాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.