సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా పాత రావిచర్లలో ముద్రబోయిన పర్యటన ఉంది. ఈ వివాదం తేల్చిన తరువాతే పర్యటనకు అంగీకరిస్తామంటూ ఎంపీ మాగంటి వర్గీయులు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు పెద్ద సంఖ‍్యలో మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment